దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ మూడు టెస్ట్‌లు ఆడనుంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్‌లో భారత ఆటగాడు ఒక గంటలోపు ఆటను మార్చగలడని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. భారత బౌలర్లు రాణిస్తారని.. అయితే బ్యాటర్లు మెరుగ్గా ఆడడమే ముఖ్యమైన్నారు. విరాట్ కోహ్లీపై మాత్రమే ఆధారపడరని.. రిషబ్ పంత్ లాంటి వారిని పూర్తిగా ఉపయోగించుకోవాలన్నారు. సెంచూరియన్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
” పరుగులు చేయడం సవాలుగా ఉంటుంది. అదే పెద్ద సమస్య. 2018లో విరాట్ ఒక్కడే పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు మెరుగ్గా ఉండాలి. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ మరింత సమతుల్యంగా ఉంది. రిషబ్ పంత్ ఒకటి లేదా ఒకటిన్నర గంటలు బ్యాటింగ్ చేస్తే ఆటను మార్చగలడు. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారు విరాట్‌కు సహకరించాలి” అని అతను చెప్పాడు.
శిక్షణ సమయంలో గాయం కావడంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. జాఫర్ భారత బౌలింగ్‌ను ప్రశంసించాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలకు తన మద్దతు తెలిపాడు. “భారత ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడు చాలా అనుభవంతో ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి చాలా అనుభవం ఉంది. భారత్‌కు ఆల్‌రౌండ్ అటాక్ ఉంది. భారత్ 400 ప్లస్ స్కోర్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది.” జాఫర్ చెప్పాడు.
Read Also.. IND vs SA: ధోనీ రికార్డును అధిగమించనున్న రిషబ్ పంత్.. 3 వికెట్ల దూరంలో ఉన్న యువ వికెట్ కీపర్..