
భారత టీ20 జట్టులో మూడో స్థానం కోసం యువ సంచలనం తిలక్ వర్మ, సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా విరాట్ కోహ్లి వెన్నుముక మాదిరిగా నడిపిన ఈ స్థానాన్ని ఇద్దరిలో ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. ఇటీవల, టెస్టిక్యులర్ సర్జరీ కారణంగా తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. ఈ పరిణామాలతో మూడో స్థానంలో ఏ ఆటగాడు బెస్ట్ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మంచి అనుభవం ఉంది. అతడు ఒత్తిడిలో కూడా టీంను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తాడు. అయితే తిలక్ వర్మ ఆల్‌రౌండర్. అతడు మూడో స్థానం నుంచి ఏడో స్థానం వరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడని, అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడతాడని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇద్దరు ఆటగాళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 47 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసి 1104 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు, స్ట్రైక్ రేట్ 136.12గా ఉంది. అంతర్జాతీయ టీ20లలో అయ్యర్ ఎనిమిది అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అతడు కెరీర్‌లో ఎక్కువగా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ స్థానంలో 19 ఇన్నింగ్స్‌లలో 530 పరుగులు సాధించి.. అత్యధికంగా 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ నాలుగు అర్ధ సెంచరీలు కొట్టాడు.
మరోవైపు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన దగ్గర నుంచి తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. టీమిండియాకి తన అవసరాన్ని చాటుకుంటూ ఒత్తిడిలోనూ రాణిస్తూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. తిలక్ వర్మ ఇప్పటివరకు 40 టీ20 మ్యాచ్‌లలో బరిలోకి దిగి, 37 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. అతను 1183 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 120 పరుగులు. అతని బ్యాటింగ్ సగటు 49.29గా, స్ట్రైక్ రేట్ 144.09గా ఉంది. తిలక్ కెరీర్‌లో రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. మూడో స్థానం నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేసిన అనుభవం ఉన్నప్పటికీ, మూడో స్థానంలో అతని రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. వన్ డౌన్ స్థానంలో 15 మ్యాచ్‌లలో 542 పరుగులు సాధించాడు. ఇక్కడ అతడి సగటు 60.22, స్ట్రైక్ రేట్ 160.83. ఈ స్థానంలో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేశాడు.
గత ఐపీఎల్ సీజన్‌ను పరిశీలిస్తే, శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్‌లలో 604 పరుగులు (సగటు 50.33, స్ట్రైక్ రేట్ 175.07) చేసి ఆరు అర్ధ సెంచరీలు కొట్టాడు. అదే సమయంలో, తిలక్ వర్మ 16 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్‌లలో 343 పరుగులు (సగటు 31.18, స్ట్రైక్ రేట్ 138.30) చేసి రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. రాబోయే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో అయ్యర్ రాణిస్తే, తర్వాతి రెండు మ్యాచ్‌లలో తిలక్ వర్మకు తన సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మొత్తంగా 2026 టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో స్థానం కోసం వీరిద్దరి మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతోంది.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..