T20I Cricketer of the Year: 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు.. కట్‌చేస్తే.. ఐసీసీ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మనోడే

ICC Men’s T20I Cricketer of the Year: వెస్టిండీస్, యూఎస్‌ఏలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన భారత్.. ఎన్నో ఏళ్ల కరువుకు స్వస్తి చెప్పింది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. పవర్‌ప్లే, డెత్ బౌలర్‌లలో డేంజరస్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2024లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఐసీసీ అవార్డ్ గెలుచుకున్నాడు. ఐసీసీ పురుషుల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు.

T20I Cricketer of the Year: 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు.. కట్‌చేస్తే.. ఐసీసీ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మనోడే
Icc Mens T20i Cricketer Of The Year 2024

Updated on: Jan 25, 2025 | 4:56 PM

ICC Men’s T20I Cricketer of the Year: వెస్టిండీస్, యూఎస్‌ఏలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన భారత్.. ఎన్నో ఏళ్ల కరువుకు స్వస్తి చెప్పింది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. పవర్‌ప్లే, డెత్ బౌలర్‌లలో డేంజరస్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2024లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఐసీసీ అవార్డ్ గెలుచుకున్నాడు. ఐసీసీ పురుషుల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు.

ఈ 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మర్ చాలా కాలంగా అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్‌ సామర్థ్యంపై టీమిండియా చాలా నమ్మకం ఉంచింది. వరుసగా అవకాశాలు ఇస్తూ, ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో డేంజరస్‌గా మారిన అర్షదీప్.. భారత జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు.

ఇక 2024 టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ స్థాయి బౌలర్‌గా తనను తాను పూర్తిగా నిరూపించుకున్నాడు. కొత్త బంతితోనూ, పాత బంతితోనూ వికెట్లు తీయడం, ఎలాంటి మైదానాల్లోనైనా సత్త చాటడం అలవాటు చేసుకున్నాడు.

2024లో అర్ష్‌దీప్ సింగ్ T20I రికార్డ్: 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు..

కేవలం 18 మ్యాచ్‌లలో 36 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్ ఈ ఏడాది T20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో భారతదేశాన్ని టైటిల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. క్యాలెండర్ ఇయర్‌లో అర్ష్‌దీప్ కంటే ప్రపంచంలోని నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఎక్కువ T20I వికెట్లు తీశారు. వారిలో సౌదీ అరేబియాకు చెందిన ఉస్మాన్ నజీబ్ (38), శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా (38), యూఏఈకు చెందిన జునైద్ సిద్ధిక్ (40), హాంకాంగ్‌కు చెందిన ఎహ్సాన్ ఖాన్ (46) ముందున్నారు. ఈ బౌలర్లలో, హసరంగ మాత్రమే పూర్తి సభ్య దేశం తరపున అత్యధిక వికెట్లు పడగొట్టాడు.

అర్ష్‌దీప్ కేవలం 15.31 సగటుతో వికెట్లు తీశాడు. అటు పవర్‌ప్లే, ఇటు డెత్ ఓవర్లలో ప్రధానంగా బౌలింగ్ చేసినప్పటికీ, ఈ సంవత్సరాన్ని 7.49ఎకానమీ రేటుతో ముగించాడు. అతను 10.80 స్ట్రైక్ రేట్‌తో వికెట్లను పడగొట్టి, బ్యాటర్లకు పీడకలగా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..