IND vs ENG 2nd T20I: చెన్నైలో టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఆడేనా.. గాయంపై కీలక అప్‌డేట్?

India vs England 2nd T20I: చెన్నైలో తలపడేందుకు భారత్, ఇంగ్లండ్ జట్లు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. మరోవైపు భారత్ మాత్రం రెండో విజయాన్ని సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని కోరుకుంటోంది.

IND vs ENG 2nd T20I: చెన్నైలో టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఆడేనా.. గాయంపై కీలక అప్‌డేట్?
Abhishek Sharma

Updated on: Jan 25, 2025 | 2:06 PM

India vs England 2nd T20I: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20కి ఇంకా కొద్ది గంటలే ఉంది. ఇదిలా ఉంటే టీమ్ ఇండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. భారత జట్టులోని ఓపెనర్‌కు ప్రాక్టీస్ సమయంలో పెద్ద గాయమైంది. దీంతో అతను రెండో టీ20 మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి రావొచ్చు అని తెలుస్తోంది. క్యాచింగ్ డ్రిల్ సమయంలో గాయం ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తొలి టీ20లో అద్భుత ఇన్నింగ్స్..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడు రెండో టీ20కి దూరంగా ఉండాల్సి రావొచ్చు అని తెలుస్తోంది. నెట్ సెషన్‌లో అభిషేక్ చీలమండకు గాయమైనట్లు చెబుతున్నారు. ఆ తరువాత, అభిషేక్‌ను మైదానంలో జట్టు ఫిజియోథెరపిస్ట్ పరీక్షించారంట. అతని చీలమండకు రెస్ట్ ఇవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారంట.

కుంటుతూ కనిపించిన అభిషేక్..

తిరిగి పెవిలియన్‌కు వస్తుండగా కాస్త కుంటుతూ కూడా కనిపించాడు. నెట్స్‌లో కూడా బ్యాటింగ్ చేయలేదు. అభిషేక్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఫిజియోతో అరగంటకు పైగా గడిపాడు. శనివారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో అభిషేక్ తప్పుకోవాల్సి వస్తే, ప్లేయింగ్ ఎలెవన్‌లో వాషింగ్టన్ సుందర్ లేదా ధ్రువ్ జురెల్‌ను చేర్చుకునే అవకాశం భారత్‌కు ఉంది.

ఎవరు ఓపెనింగ్ చేస్తారు?

తొలి మ్యాచ్‌లో అభిషేక్‌తో కలిసి సంజు శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. జనవరి 25 సాయంత్రం నాటికి అభిషేక్ ఫిట్‌గా లేకుంటే, సంజూ శాంసన్‌తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..