India Vs Australia: ఢిల్లీ టెస్టులో భారత్‌ చారిత్రాత్మక విజయం.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.

ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మ్యాజిక్‌ చేసింది. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో..

India Vs Australia: ఢిల్లీ టెస్టులో భారత్‌ చారిత్రాత్మక విజయం.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.
Ind Vs Aus Match

Updated on: Feb 19, 2023 | 2:01 PM

ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మ్యాజిక్‌ చేసింది. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో చారిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలో నిలిచింది. స్కోర్ బోర్డ్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా స్కోర్లు-263, 113 ఆలౌట్ కాగా భారత్‌ స్కోర్లు-262 ఆలౌట్‌, 118/4గా ఉన్నాయి. భారత స్పిన్నర్ల ధాటికి కంగారులు హడలెత్తారు.

రెండు ఇన్నింగ్స్‌లో జడేజా ఏకంగా 10 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్‌ 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74రన్స్‌తో అక్షర్ పటేల్ టాప్ స్కోరర్‌గా నిలిచారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో భారత్‌ ఆధిక్యం సాధించింది. ఇదిలా ఉంటే ఈ గెలుపుతో ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్‌ వన్‌గా నలిచింది.

ఇక అంతకు ముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే బిగ్ షాక్​ఎదురైంది. పెనర్‌ ట్రెవిస్‌ హెడ్‌ను అశ్విన్‌ ఔట్ చేశాడు. 43 పరుగులు చేసిన ట్రెవిస్‌ హెడ్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇంటి దారి పట్టాడు. దీని తర్వాత మొత్తం 95 పరుగుల వద్ద మరో మూడు వికెట్లు పడ్డాయి. మ్యాట్ రాన్ షా (2), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (0), కెప్టెన్ పాట్ కమిన్స్ (0) కొద్దిసేపు పిచ్ పై నిలవలేకపోయారు. అశ్విన్ రాన్ షాను పెవిలియన్ కు పంపగా, జడేజా పీటర్, కమిన్స్ లను పెవిలియన్ కు పంపాడు. 95 పరుగులకే 7గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వరసుగా వెనుదిరిగారు.

మరిన్ని స్పోర్ట్స్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..