India vs England: బయో బబుల్ ఎఫెక్ట్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్..

|

Mar 02, 2021 | 9:10 AM

Ind vs Eng: బయో బబుల్‌లో ఉంటున్న ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. ఇంగ్లాండ్ ‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రిషబ్‌ పంత్..

India vs England: బయో బబుల్ ఎఫెక్ట్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్..
Follow us on

Will Likely Rest Rohit Sharma: గత ఏడాది కాలంగా బయో బబుల్‌లో ఉంటున్న ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. ఇంగ్లాండ్ ‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్ సుందర్‌లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నట్లుగా తెలుస్తోంది.

ఐపీఎల్- 2020 సీజన్ కోసం దుబాయ్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉండిపోయారు. ఆ తర్వాత  అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లి అక్కడ కూడా ఇదే పరిస్థితిని కొనసాగించారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే  స్వదేశానికి తిరిగి వచ్చి.. స్వల్ప విరామం తీసుకున్నారు. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్- 2021 సీజన్‌కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ అనుకుంటున్నట్లుగా సమాచారం.

భారత్​లోనే జరుగుతుందని భావిస్తున్న ఐపీఎల్-14​కు ముందు ఆటగాళ్లందరూ చాలా ఫ్రెష్‌గా ఉండాలని బోర్డు కోరుకుంటోంది. ఈ క్రమంలోనే 2020 ఐపీఎల్​నుంచి బయో బబుల్​లో​ ఉంటున్న 10 మంది ఆటగాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందికి విశ్రాంతి ఇవ్వాలని చూస్తోంది.

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు టీమ్ సభ్యులను ప్రకటించింది బీసీసీ. బుమ్రాతో పాటు సిరాజ్​కు ఆ సిరీస్​ నుంచి రెస్ట్ ఇచ్చింది. వ్యక్తిగత కారణాలతో విజ్ఞప్తి చేయడంతో పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా వల్ల చివరి టెస్టు కంటే ముందు నుంచే అతణ్ని బోర్డు జట్టు నుంచి విడుదల చేసింది. బుమ్రా నాలుగో టెస్టు సహా వన్డే, టీ20 సిరీస్‌లకు సైతం దూరం కానున్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ మార్చి 23, 26, 28 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

అసలు టీ20 సిరీస్‌కు ముందే బీసీసీఐ.. కావాలంటే విశ్రాంతి తీసుకునే అవకాశం ఆటగాళ్లకు కల్పించింది. బయో బబుల్​‌లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వచ్చే సమస్యల గురించి ఆటగాళ్లకు బీసీసీఐ చెప్పింది. ఆటగాళ్లపై భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఇప్పటికే బుమ్రా, సిరాజ్​లకు ఇంగ్లాండ్​తో టీ20ల నుంచి విశ్రాంతినిచ్చింది.

ఇక ఇంగ్లాండ్​తో జరిగే వన్డే సిరీస్​కు రోహిత్​ శర్మతో పాటు సుందర్​, పంత్​లను దూరం పెట్టనున్నట్లు సమాచారం. మార్చి 23, 26, 28వ తేదీల్లో వన్డే మ్యాచ్​లు జరగనున్నాయి. అంతకంటే ముందు 12, 14, 16, 18, 20 తేదీల్లో ఇరు జట్లూ టీ20 మ్యాచ్​లు ఆడతాయి.

ఇవి కూడా చదవండి

శుభవార్త.. మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌ చార్జీ.. ఫాస్టాగ్‌తో రూ.20 వేల కోట్ల ఆదా: మంత్రి నితిన్‌ గడ్కరీ

First Corona Case in Telangana: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు… తెలంగాణలో కరోనా మహమ్మారి జాడ ..