Great Catch: ఊహకు అందని రీతిలో స్పందించిన ఫీల్డర్.. ఆఫ్ సైడ్ నుంచి లెగ్ సైడ్‌కు వచ్చి గాల్లో తేలుతూ..

Great Catch By Filder: క్రికెట్ అంటేనే ఊహకు అందని పరిణామాల సమాహారం. అప్పటి వరకు మ్యాచ్ గెలుస్తుందనుకున్న జట్టు ఒక్కసారిగా ఓడిపోవచ్చు. ఓటమి చివరిలో ఉన్న..

Great Catch: ఊహకు అందని రీతిలో స్పందించిన ఫీల్డర్.. ఆఫ్ సైడ్ నుంచి లెగ్ సైడ్‌కు వచ్చి గాల్లో తేలుతూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 01, 2021 | 6:48 PM

Great Catch By Filder: క్రికెట్ అంటేనే ఊహకు అందని పరిణామాల సమాహారం. అప్పటి వరకు మ్యాచ్ గెలుస్తుందనుకున్న జట్టు ఒక్కసారిగా ఓడిపోవచ్చు. ఓటమి చివరిలో ఉన్న జట్టు కూడా ఒక్కసారిగా విజయతీరాలకు చేరవచ్చు. అందుకే క్రికెట్ మ్యాచ్ చూడడానికి చాలా మంది ఆసక్తిచూపిస్తుంటారు. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు క్రికెట్‌లో ఫీల్డింగ్ కూడా మజా ఇస్తుంది. ఫీల్డర్లు పట్టుకునే అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్‌ను టర్న్ చేయడంతోపాటు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని చూపిస్తుంటాయి. చివరికి ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు మంచి ఫీల్డింగ్ చేసినా.. క్లాప్స్ కొట్టకుండా ఉండలేం. తాజాగా ఇలాంటి క్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే తాజాగా దక్షిణాఫ్రికా దేశవాళి క్రికెట్‌లో భాగంగా ఓ 50 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా మార్టిన్ వాన్ జార్స్ వెల్డ్ అనే ఆటగాడు ఫస్ట్ స్లిప్‌లో ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలోనే బౌలర్ విసురుతోన్న ఓ బంతికి బ్యాట్స్ మెన్ స్కూప్ రివర్స్ షార్ట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఆఫ్ సైడ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ జార్స్ వెల్డ్ బంతి లెఫ్ట్ సైడ్ స్లిప్‌లోకి వస్తుందని ముందుగానే ఊహించి ఆ వైపు వెళ్లాడు. బంతికి చేతికి అందే పరిస్థితులు లేకపోయే సరికి వికెట్ కీపర్ వెనుక నుంచి అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. దీంతో ఈ అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ అద్భుత క్యాచ్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Cricketer Rohit Sharma: నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌పై రోహిత్ శర్మ ఫన్నీ పోస్ట్.. ట్రోల్ చేసిన రితికా.. రెస్పాండ్ అయిన కుల్దీప్..

Indian Hockey Team Return: కోవిడ్ తర్వాత తొలి విజయం.. జర్మనీ జట్టును చిత్తుగా ఓడించిన భారత్..

Fire Limbo Skating: వయసేమో ఐదేళ్లు.. ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది.. అందరిచేత హ్యాట్సాప్ అనిపించుకుంది..

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..