Video: సిరాజ్ దెబ్బకు శ్రీలంక గజగజ.. మనోడి వీడియో చూస్తే రోమాలు నిక్కబోడవాల్సిందే..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన శ్రీలంక జట్టుకు ఆరంభం చెడిపోయింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఆరో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ పెరీరా, కెప్టెన్ దసున్ షనక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక సున్నా వద్ద ఔట్ కాగా, పాతుమ్ న్‌సంక 2 పరుగులు చేసి డిసిల్వా 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

Video: సిరాజ్ దెబ్బకు శ్రీలంక గజగజ.. మనోడి వీడియో చూస్తే రోమాలు నిక్కబోడవాల్సిందే..
Ind Vs Sl Final Siraj Records

Updated on: Sep 17, 2023 | 4:59 PM

Mohammed Siraj Fastest ODI Five-Wicket Haul Video: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఊచకోతతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఏకంగా తన తొలి స్పెల్ 5 ఓవర్లలో 5 వికెట్లతో రెచ్చిపోయాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే శ్రీలంకకు ఆరంభాన్ని తొలుత బుమ్రా చెడగొట్టగా.. ఆ తర్వాత రెండో వికెట్ నుంచి సిరాజ్ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఓ దశలో లంక భారత బౌలర్ సిరాజ్ ధాటికి 6 వికెట్లు కోల్పోయి 12 పరుగులే చేసింది.

మొత్తంగా సిరాజ్ ప్రస్తుతం ఈమ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. అతను చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, పాతుమ్ నిస్సాంక, దసున్ షనకలను ఔట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన శ్రీలంక జట్టుకు ఆరంభం చెడిపోయింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఆరో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ పెరీరా, కెప్టెన్ దసున్ షనక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక సున్నా వద్ద ఔట్ కాగా, పాతుమ్ న్‌సంక 2 పరుగులు చేసి డిసిల్వా 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

శ్రీలంక వికెట్ల పతనం..

మొదటి: (కుశాల్ పెరీరా – 0 పరుగు): జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ మూడో బంతికి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు.

రెండోది: (పాతుమ్ నిస్సాంక- 2 పరుగులు): నాలుగో ఓవర్ తొలి బంతికి సిరాజ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. పాయింట్ వద్ద జడేజా అద్భుత క్యాచ్ పట్టాడు.

మూడో: (సదీర సమరవిక్రమ – 0 పరుగు): నాల్గో ఓవర్ మూడో బంతికి సదీర బౌల్డ్ అయ్యాడు.

నాల్గవది: (చరిత్ అసలంక- 0 రన్): నాలుగో ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు.

ఐదో: (ధనంజయ్ డిసిల్వా – 4 పరుగులు): నాలుగో ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆరో: (దాసున్ షనక – 0 పరుగులు): సిరాజ్ ఆరో ఓవర్ నాలుగో బంతికి షనక పెవిలియన్ చేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..