IPL 2021 Schedule: IPL మ్యాచ్‌ల నిర్వహణకు వేదికలు ఖరారయ్యాయి. అయితే.. హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరుతో ఏకంగా టీమ్ ఉన్నప్పటికీ… ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించడం లేదు. అన్ని మ్యాచ్‌లు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీల్లో నిర్వహించబోతున్నారు.
ఐపీఎల్- 2021కి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. రెండేళ్ల అనంతరం తిరిగి ఈ దఫా ఐపీఎల్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది. ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఐపీఎల్- 14వ సీజన్‌ను ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
చెన్నై వేదికగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం కానుందని పేర్కొంది. తొలుత నిర్ణయించినట్లుగా మొత్తం ఆరు వేదికలలో మ్యాచ్‌ల నిర్వహణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతాలను వేదికలుగా నిర్ణయించింది. మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయని బోర్డు పేర్కొంది. చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగుళూరులలో పదేసి మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయని వెల్లడించింది. మిగిలిన రెండు వేదికలలో 8 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి.
అన్ని జట్లకు తటస్థ వేదికలను ప్రకటించింది ఐపీఎల్ పాలక మండలి. ఏ జట్టుకు సొంత మైదానంలో ఆడే అవకాశమే లేదని స్పష్టం చేసింది. లీగ్ మ్యాచ్‌లను ప్రతి జట్టు నాలుగు వేదికలలో ఆడనున్నాయి.
#VIVOIPL is back in India ?? ?
Time to circle your favorite matches on the calendar ?️
Which clashes are you looking forward to the most? ? pic.twitter.com/kp0uG0r9qz
— IndianPremierLeague (@IPL) March 7, 2021
Gold Mountain Discovered: ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..