IND vs NZ: స్పైడర్‌ కెమెరాతో మ్యాచ్‌కు అంతరాయం.. టీమిండియా క్రికెటర్ల ఆటవిడుపు.. మీమ్స్‌తో చెలరేగిన నెటిజన్లు..

|

Dec 06, 2021 | 6:52 AM

సాధారణంగా వర్షం పడితేనో, వాతావరణం అనుకూలించకపోతేనో క్రికెట్‌ మ్యాచ్‌లు మధ్యలోనే ఆపేస్తారు. శునకాలు, ఇతర జంతువులు మైదానంలోకి ప్రవేశించినప్పుడు కూడా మ్యాచ్‌లు నిలిపేసిన సంఘటనలున్నాయి

IND vs NZ:  స్పైడర్‌ కెమెరాతో మ్యాచ్‌కు అంతరాయం.. టీమిండియా క్రికెటర్ల ఆటవిడుపు.. మీమ్స్‌తో చెలరేగిన నెటిజన్లు..
Follow us on

సాధారణంగా వర్షం పడితేనో, వాతావరణం అనుకూలించకపోతేనో క్రికెట్‌ మ్యాచ్‌లు మధ్యలోనే ఆపేస్తారు. శునకాలు, ఇతర జంతువులు మైదానంలోకి ప్రవేశించినప్పుడు కూడా మ్యాచ్‌లు నిలిపేసిన సంఘటనలున్నాయి. అదేవిధంగా అభిమానులు, అగంతకులు గ్రౌండ్‌లోకి వచ్చినప్పుడు కొద్దిసేపు క్రికెట్‌ కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగిన సందర్భాలున్నాయి. అయితే ముంబయి వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్‌ని కవర్‌ చేసే స్పైడర్‌ కెమెరా పిచ్‌ కి తక్కువ ఎత్తులో వచ్చి ఎటూకాకుండా ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ సిబ్బంది మైదానంలోకి వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. పైకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. దీంతో ఏం చేయాలో తోచలేని అంపైర్లు నిర్ణీత సమయానికంటే ముందే టీ విరామం ప్రకటించారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ చివరి బంతికి కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ ఎల్బీగా వెనుదిరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఏయ్..పైకి వెళ్లిపో..
స్పైడర్‌ కెమెరా ఎటూ కాకుండా ఆగిపోవడంతో మైదానంలోని టీమిండియా క్రికెటర్లు సరదాగా ఆటాడుకున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు కెమెరా ముందు నిలబడి ‘ ఏయ్‌..ఇక్కడి నుంచి వెళ్లిపో’ అన్నట్లు సంజ్ఞలిచ్చారు. ఇక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా బాహుబలి రేంజ్‌లో కెమెరాని భుజాలమీదకు ఎత్తుతున్నట్లు పోజులిచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మిగతా క్రికెటర్లు కూడా కెమెరాతో ఆడుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా మీమ్స్‌తో చెలరేగారు. ఇక ముంబయి టెస్ట్‌ విషయానికొస్తే 540 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్‌ మూడో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అశ్విన్‌ మూడు వికెట్లతో రాణించాడు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా విజయం ఇక లాంఛనమే.

IND vs NZ: ముంబైలో టీమిండియా ఓపెనర్ల రికార్డు ప్రదర్శన.. 89 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి..!

ఫాస్టెస్ట్ సెంచరీలో గేల్, ఏబీడీలను వెనక్కు నెట్టిన 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. 85 ఏళ్ల నాటి బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టిన ప్లేయర్ ఎవరో తెలుసా?

IPL 2022 Mega Auction: జహీర్ ఖాన్ ఇచ్చిన ఓ సలహా నా జీవితాన్నే మార్చింది: ఐపీఎల్ 2021 పర్పుల్ క్యాప్ బౌలర్