దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ వైరస్ బారిన పడి రోజుకూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పలువురు సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు మరణించారు. తాజాగా ఈ వైరస్ టీమిండియా క్రికెటర్ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. కొద్ది రోజుల క్రితం భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి కరోనా సోకి మరణించింది. ఇప్పుడు ఆమె తన సోదరిని కూడా కోల్పోయింది. రోజు ఉదయం వేదా సోదరి వత్సల శివ కుమార్ కరోనాతో మరణించింది. ఈ విషయాన్ని వేదా కృష్ణమూర్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇటీవల కరోనా బారిన పడి వేదా తల్లి చెలువంబా దేవి మరణించిన సంగతి తెలిసిందే. వేదా కృష్ణమూర్తి కుటుంబంలోని కొందరి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే , కొద్ది రోజుల క్రితం వేదా అమ్మకు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను చిక్కమగళూరు జిల్లాలోని కడూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
మరోవైపు వేదా కృష్ణమూర్తి తండ్రి ఎస్‌జీ కృష్ణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో వారు కడూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే వేదా కృష్ణమూర్తికి మాత్రం కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. వేదా కుటుంబం ప్రస్తుతం బెంగుళూరులో ఉంటుంది. ఇక కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగిన తర్వాత ఆమె కుటుంబం మొత్తం స్వగ్రామం కడూరుకు వెళ్ళారు. ప్రస్తుతం అక్కడే వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
ట్వీట్..
It is with great sadness that last night my family had to say goodbye to My Akka My family, my world has been rocked to its core. Appreciate all the messages and prayers . My thoughts with everyone going through these devastating times. Hold your loved ones tight and stay safe ?
— Veda Krishnamurthy (@vedakmurthy08) May 6, 2021
విక్రమ్ వేదకు ఏమైంది…? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..