టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు దివ్యా సింగ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. మంగళ వారం (నవంబర్ 28)న ముఖేష్-దివ్య ల వివాహం అట్టహాసంగా జరిగింది. గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4న గోరఖ్‌పూర్‌లో ముఖేష్-దివ్యల వివాహ రిసెప్షన్ జరగనుంది. నిజానికి, భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ముఖేష్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ ఆ తర్వాత భారత జట్టు నుంచి సెలవు తీసుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందే ముఖేష్ అందుబాటులో లేడని తెలిపిన కెప్టెన్ సూర్య, ముఖేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుడని, అందుకే జట్టు నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. కాగా మూడో టీ20 మ్యాచ్‌కు అందుబాటులో లేని ముఖేష్ కుమార్ రాయ్‌పూర్‌లో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు శుక్రవారం జట్టులో చేరనున్నాడని బీసీసీఐ వెల్లడించింది.
ఇక ముఖేష్ కెరీర్ విషయానికొస్తే.. ఏడాది క్రితం టీమ్ ఇండియాలో చేరిన ముఖేష్ ఏడాది వ్యవధిలోనే మూడు ఫార్మాట్లలోనూ జట్టులో స్థానం సంపాదించుకోవడం విశేషం. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా ముఖేష్ వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇక IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ముఖేష్ కుమార్? 2022 సీజన్ వేలంలో ముఖేష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 5 కోట్లకు కొనుగోలు చేసింది. ముఖేష్ కుమార్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక టెస్టు, మూడు వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. టెస్టుల్లో రెండు వికెట్లు, వన్డే, టీ20 ఫార్మాట్‌లో తలా నాలుగు వికెట్లు తీశాడు.
Mukesh Kumar, Caught & Bowled ft. Divya Singh 🫶
Welcome to the DC Family, Divya ♥️ pic.twitter.com/E8Ue3Rglpd
— Delhi Capitals (@DelhiCapitals) November 29, 2023
हल्दी की रस्म में दोस्तों के साथ जमकर नाचे भारतीय क्रिकेटर मुकेश कुमार 😍❤️#MukeshKumar #Cricket pic.twitter.com/zBTwkeBIep
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) November 28, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..