Team India Jersey: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు.. అసలు కారణం ఇదే..

Asia Cup 2023, Team India Jersey: క్రికెట్ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా, పాకిస్థాన్ పేరుతో ఉన్న జెర్సీని ధరించి ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈసారి ఆసియా కప్‌ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ, భారత్, పాక్ సంబంధాలు దెబ్బతినడంతో పాక్‌తో కలిసి శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

Team India Jersey: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు.. అసలు కారణం ఇదే..
Team India Jersey

Updated on: Aug 11, 2023 | 4:25 PM

Team India Jersey: క్రికెట్ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా టీమిండియా ఓ పని చేయనుంది. పాకిస్థాన్ పేరుతో ఉన్న జెర్సీని ధరించి ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ (Asia Cup 2023) బరిలో టీమిండియా(Team India) ఆడనుంది. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాకిస్థాన్ (Pakistan) పేరుతో జెర్సీలు ధరించి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి ఈసారి ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. తద్వారా ఆసియాకప్‌లో పాల్గొనే అన్ని జట్ల జెర్సీలపై పాకిస్థాన్ పేరును ముద్రించనున్నారు. అందుకే విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సహా భారత జట్టులోని ఆటగాళ్లందరూ పాకిస్థాన్ పేరుతో ఉన్న జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు.

ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో ఉమ్మడి ఆతిథ్య పాకిస్థాన్ టీం నేపాల్ జట్టుతో తలపడనుంది. నిజానికి ఈసారి ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్థాన్‌కు దక్కింది. కానీ భారత్, పాక్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ వెనుకాడింది. అందుకే ఈసారి ప్రపంచకప్‌కు శ్రీలంక, పాకిస్థాన్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

రెండు జట్లు మూడుసార్లు ఢీ?

పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశం. కాబట్టి, అన్ని టీమ్ జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు ముద్రించనున్నారు. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ క్యాండీలో జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం స్టేడియం హౌస్ ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ టోర్నీలో ఇరు జట్లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.

ఏడోసారి ఆసియా కప్ గెలిచే అవకాశం..

లీగ్ దశలో ఒక మ్యాచ్ ఆడనున్న ఇరు జట్లు ఆ తర్వాత సూపర్ 4 దశలో కూడా తలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇరు జట్లు ఫైనల్ చేరితే.. ఈ జట్ల మధ్య మూడోసారి క్రికెట్ పోరు జరగనుంది. గత ఆసియాకప్‌లో.. అంటే 2022 ఆసియాకప్‌లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఈసారి ఏడోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకునే దిశగా రోహిత్ శర్మ జట్టు దూసుకుపోతుందని భావిస్తున్నారు.

ఆసియా కప్‌నకు భారత్ ప్రాబబుల్ స్క్వాడ్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, జస్ప్రిత్ సింగ్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..