టీ20 ప్రపంచ కప్ 2022లో తమ మొదటి మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆఖరి బంతికి భారత్ విజయం సాధించడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు తన పేరిట అనేక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. అలాంటి కొన్ని రికార్డులను ఓసారి చూద్దాం..
31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీని తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లో చేర్చారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా పాకిస్థాన్‌పై భారత్‌కు అతిపెద్ద భాగస్వామ్యంగా మారింది.
టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా