Rohit Sharma: ప్లీజ్ రోహిత్.. ఇప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించు.. ఎంసీజీ వైఫల్యంపై నెటిజన్ల ఫైర్

|

Dec 27, 2024 | 10:04 AM

Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ రిటైర్ అవ్వాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా

Rohit Sharma: ప్లీజ్ రోహిత్.. ఇప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించు.. ఎంసీజీ వైఫల్యంపై నెటిజన్ల ఫైర్
Rohit Sharma
Follow us on

Rohit Sharma continued to fail with the bat in the Test series in Australia: మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. దీంతో అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. భారత ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రోహిత్‌ 3 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు లూజ్ షాట్‌కు ఔట్ కావడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో రోహిత్ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు.

బ్యాట్‌తో పేలవమైన ఫామ్ కొనసాగిస్తోన్న రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా తిరిగి రావడం కూడా కలిసి రాలేదు. పాట్ కమ్మిన్స్ వేసిన డెలివరీకి రోహిత్ హాఫ్-పుల్ ఆడాడు. అది షార్ట్ పిచ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

భారత కెప్టెన్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లలో 3, 6, 10, 3 స్కోర్‌లతో 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రోహిత్ షాట్‌లో విశ్వాసం లేకపోవడం కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లోకి దిగిన అడిలైడ్, బ్రిస్బేన్‌లలో బ్యాట్‌తో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ ఆడడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మొదటి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో పెర్త్‌లో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అడిలైడ్‌లో రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచి, పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా లేవు.

టెస్టు క్రికెట్‌లో 2024లో రోహిత్ బ్యాటింగ్ దిగజారిపోయింది. టెస్టు క్రికెట్‌లో తన చివరి 14 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒకే ఒక్కసారి 50+ స్కోరు చేయడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..