Virat Kohli: కొలంబోలో కింగ్ కోహ్లి ప్రస్థానం.. హాఫ్ సెంచరీతో స్పెషల్ జాబితాలో చేరిన రన్ మెషీన్..

India vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 66వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ 100+ భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 121 పరుగుల వద్ద ఔట్ కాగా, 123 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.

Virat Kohli: కొలంబోలో కింగ్ కోహ్లి ప్రస్థానం.. హాఫ్ సెంచరీతో స్పెషల్ జాబితాలో చేరిన రన్ మెషీన్..
వన్డే క్రికెట్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ల బంతుల్లో మాత్రమే విరాట్ కోహ్లీ ట్రిప్ అవుతున్నాడు. అయితే, ఓవరాల్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, కోహ్లి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 220 ఇన్నింగ్స్‌లలో ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు.

Updated on: Sep 11, 2023 | 6:13 PM

Asia Cup 2023, Virat Kohli: ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య కొలంబో మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బ్యాట్‌ నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది. రాహుల్‌తో కలిసిన అద్భుత ఇన్నింగ్స్ ఆడుతోన్న కోహ్లీ.. తన వన్డే కెరీర్‌లో 66వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఇది కాకుండా, అతను 2023 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తన 1000 పరుగులను కూడా పూర్తి చేశాడు.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కీలక భాగస్వామ్యం..

మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇద్దరి మధ్య 150+ భాగస్వామ్యం ఉంది.

రాహుల్ తన కెరీర్‌లో 60 బంతుల్లో 14వ ఫిఫ్టీని పూర్తి చేశాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్‌మన్ గిల్ 58 పరుగుల వద్ద ఔటయ్యాడు.

సెంచరీ దాటిన భాగస్వామ్యం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..