MS Dhoni: భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో మహేంద్ర సింగ్ ధోని ఇండియాలో లేడు. ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు ఆడేందుకు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. భారత సైన్యం పట్ల ధోని ప్రేమ, నమ్మకం గురించి అందరికీ తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించిన సంగతి తెలిసిందే. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, భారత సైన్యం కల్నల్, వెంబు శంకర్ ధోనీకి ప్రశంసలతో ముంచెత్తారు. భారత సైన్యం, దేశం పట్ల ధోని అభిమానానికి కల్నల్ శంకర్ వందనం చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కల్నల్ వెంబు శంకర్ వీడియోను పంచుకుంది. ఇందులో అతను ధోనీతో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు. ఈ వీడియోలో, కల్నల్ శంకర్.. ధోనీలు ఇండియన్ ఆర్మీ అనే నాణేనికి రెండు వైపులా ఉన్నారని, దానిని వేరు చేయలేమని చెబుతున్నట్లు కనిపిస్తోంది.
ఎంఎస్ ధోనీ కవాతు నైపుణ్యాలు అద్భుతమైనవని భారత సైన్యం కల్నల్ అన్నారు. నేను 20 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నప్పటికీ, నాకంటే మెరుగ్గా కవాతు చేస్తాడని తెలిపాడు. కల్నల్ శంకర్ మాట్లాడుతూ.. ‘ధోనీకి, భారత సైన్యానికి మధ్య చాలా ప్రేమ ఉంది. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ ప్రేమను దగ్గర నుంచి చూశాను. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత జెర్సీలో సైన్యం దుస్తుల్లో మార్పును గమనిస్తే ఆవిషయం తెలుస్తుందని’ అని అన్నారు.
ధోని ప్రస్తుతం సీఎస్‌కే టీంతో దుబాయంలో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిని తరువాత తోటి ఆటగాళ్లతో ఐపీఎల్ 2021 కోసం సిద్ధమవనున్నాడు. ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి మ్యాచ్ చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సి ఉంది.
‘I am on National Duty, Everything else can wait!’ – MS Dhoni
?: Colonel Vembu Shankar on @msdhoni and his respect for Armed forces – https://t.co/VlJa9qj8gO#WhistlePodu #Yellove ?? pic.twitter.com/BaFQJ3aueA
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) August 15, 2021