
India vs Pakistan, 12th Match: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ 8వ సారి కూడా భారత్‌పై విజయం సాధించలేకపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన విజయాల జైత్రయాత్రను కొనసాగించింది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 31 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్‌కు శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
పాక్ బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ అజామ్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఐదుగురు భారత బౌలర్లు తలో 2 వికెట్లు తీశారు. భారత్‌లో రోహిత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ 53 పరుగులు చేశాడు. షాహీన్ షా ఆఫ్రిది అత్యధికంగా 2 వికెట్లు తీశాడు.
చాలా నెలల వివాదాల తర్వాత ఈ మ్యాచ్ ఎట్టకేలకు జరిగింది. కానీ తీవ్ర పోటీని ఆశించిన చోట.. టీమ్ ఇండియా వార్ వన్ సైడే చేసేసింది. తొలుత బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌ను పూర్తిగా గేమ్ నుంచి వెనక్కునెట్టేసింది. దీంతో 31 ఏళ్ల తర్వాత కూడా పాక్ వన్డే ప్రపంచకప్‌లో విజయాన్ని అందుకోలేకపోయింది. 1992 నుంచి మొదలైన ఈ విజయ యాత్రను కొనసాగించిన టీమ్ ఇండియా.. పాకిస్థాన్‌ను ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఓడించింది. దీంతో టీమిండియా న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.
Make it 3⃣ in a row for #TeamIndia! 👏 👏
Shreyas Iyer sails past FIFTY as India beat Pakistan by 7 wickets! 👍 👍
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/ucoMQf2bmU
— BCCI (@BCCI) October 14, 2023
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..