IND vs SA: తొలిరోజు సౌతాఫ్రికాదే పై చేయి.. భారత్ 202 పరుగులకు ఆలౌట్‌..

|

Jan 03, 2022 | 7:47 PM

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటిరోజు సఫారీలదే పై చేయి అయింది. ఇండియా 63.1 ఓవర్లోలో 202 పరుగులకు

IND vs SA: తొలిరోజు సౌతాఫ్రికాదే పై చేయి.. భారత్ 202 పరుగులకు ఆలౌట్‌..
Ind Vs Sa
Follow us on

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటిరోజు సఫారీలదే పై చేయి అయింది. ఇండియా 63.1 ఓవర్లోలో 202 పరుగులకు ఆలౌట్‌ అయింది. మొదటగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియాకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. మయాంక్ అగర్వాల్ 26 పరుగులకు ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా 3 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అజింకా రహానె డకౌట్‌ అయ్యాడు.

పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ని కెప్టెన్‌ కెఎల్‌.రాహుల్‌ హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. 128 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. కెరీర్‌లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 116 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆశ్విన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివరగా జస్ప్రీత్‌ బుమ్రా రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో భారత్ స్కోరు 200 పరుగలైనా దాటగలిగింది. మహ్మద్‌ సిరాజ్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్‌ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ మూడు వికెట్లు సాధించారు.

Amaravati: కార్పొరేషన్‌గా ఏపీ రాజధాని అమరావతి.. నోటిఫికేషన్ జారీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్

Beach Deaths: సరదాగా గడిపేందుకు సాగరతీరం వస్తే.. ప్రాణాలు తీస్తున్న రాకాసి అలలు.. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది!

Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..