టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌లో నవంబర్ 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244గా నిలిచింది. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున సీన్ విలియమ్స్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం జింబాబ్వే కేవలం 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ తలో 2 వికెట్లు పడగొట్టారు.
జింబాబ్వే ప్లేయింగ్ XI: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ
భారత్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కెప్టెన్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో విజయంతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 244గా నిలిచింది. ఈ సమయంలో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. జింబాబ్వే కేవలం 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది.
జింబాబ్వే జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు 15.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 106 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో షమీ 2, భువీ 1, అర్షదీప్ 1, పాండ్యా 1, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.
15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ 2, భువీ 1, అర్షదీప్ 1, పాండ్యా 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టాడు. జింబాబ్వే విజయానికి 30 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది.
10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 5 వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ 2, భువీ 1, అర్షదీప్ 1, పాండ్యా 1 వికెట్ పడగొట్టాడు. జింబాబ్వే విజయానికి 60 బంతుల్లో 128 పరుగులు చేయాల్సి ఉంది.
జింబాబ్వే జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు 7.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 36 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో షమీ 2, భువీ 1, అర్షదీప్ 1, పాండ్యా 1 వికెట్ పడగొట్టాడు.
6 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్లు నష్టపోయి 28 పరుగులు చేసింది. భువనేశ్వర్ 1, అర్షదీప్ 1, షమీ 1 వికెట్ పడగొట్టారు. జింబాబ్వే విజయానికి 84 బంతుల్లో 159 పరుగులు కావాల్సి ఉంది.
4 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 2 వికెట్లు నష్టపోయి 13 పరుగులు చేసింది. భువనేశ్వర్ 1, అర్షదీప్ 1 వికెట్ పడగొట్టారు.
టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ నేడు జింబాబ్వేతో తలపడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 51, సూర్యకుమార్ 59, పాండ్యా 30 పరుగులు చేశారు. విరాట్ 26, రోహిత్ 15 , పంత్ 3 పరుగులు మాత్రమే చేశారు. జింబాబ్వే ముందు 187 పరుగుల టార్గెట్ ఉంది.
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది. పాండ్యా 3, సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రిషబ్ పంత్ (3) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 101 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దినేష్ కార్తీక్ స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు.
కేఎల్ రాహుల్(51 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 95 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఔట్ అయ్యాడు.
విరాట్ కోహ్లీ(26 పరుగులు, 25 బంతులు, 2 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 87 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ 45 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 79 పరుగులు చేసింది. రాహుల్ 41 పరుగులు, కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరి మధ్య కేవలం 35 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.
6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 46 పరుగులు చేసింది. రాహుల్ 20 పరుగులు, కోహ్లీ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ(15 పరుగులు, 13 బంతులు, 2 ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 27 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. రాహుల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 18 పరుగులు చేసింది. రోహిత్ 7, రాహుల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
జింబాబ్వే ప్లేయింగ్ XI: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ
భారత్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కెప్టెన్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
జింబాబ్వేతో మ్యాచ్‌లో రోహిత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో జింబాబ్వే టీం ఫీల్డింగ్ చేయనుంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.
నెదర్లాండ్స్ విజయంతో గ్రూప్ 2 సమీకరణాలు మారిపోయాయి. భారత్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.