Watch Video: టీమిండియా ‘సిక్సర్ల కింగ్’ రీ ఎంట్రీకి సిద్ధం.. ప్రాక్టీస్‌లో భారీ హిట్స్‌.. వెల్‌కం బ్యాక్ అంటోన్న ఫ్యాన్స్..

|

Aug 17, 2022 | 1:46 PM

Legends League Cricket: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఇండియా మహారాజా జట్టు తరపున యువరాజ్ సింగ్ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్ 2019 ప్రపంచ కప్ విజేత ఇంగ్లీష్ కెప్టెన్ ఓన్ మోర్గాన్ నేతృత్వంలోని ప్రపంచ జట్టుతో జరుగుతుంది.

Watch Video: టీమిండియా సిక్సర్ల కింగ్ రీ ఎంట్రీకి సిద్ధం.. ప్రాక్టీస్‌లో భారీ హిట్స్‌.. వెల్‌కం బ్యాక్ అంటోన్న ఫ్యాన్స్..
Yuvraj Singh
Follow us on

LLC Exhibition Match: టీమిండియా ‘సిక్సర్ల కింగ్’ గా పేరుగాంచిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి మైదానంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈమేరకు నెట్స్‌లో తన బ్యాటింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రాక్టీస్‌లో లాంగ్ హిట్‌లను బాదేస్తూ.. ప్రత్యర్థులకు మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో యువరాజ్ సింగ్ 41వ ఏట అడుగుపెట్టనున్నాడు. కానీ, ఆయన ఆట మాత్రం పాత యూవీనే గుర్తుచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో తన క్రికెట్ కిట్‌ను కారు నుంచి గ్రౌండ్‌కి తీసుకొచ్చాడు. ఇక్కడ అతను ఫీల్డ్‌లో ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మైదానంలోకి దిగగానే భారీ సిక్సులు కొడుతూ, ఫ్యా్న్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

తదుపరి టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్..

వీడియో ప్రారంభంలో యువరాజ్ ‘వారియర్ ఈజ్ బ్యాక్’ అని చెప్పుకొచ్చాడు. వీడియోలో మాట్లాడుతూ, మైదానంలో తన రీఎంట్రీ, ప్రాక్టీస్ గురించి యూవీ మాట్లాడాడు.

2019లో రిటైరయ్యాడు..

అనంతరం యువీ మాట్లాడుతూ ‘బ్యాటింగ్ తర్వాత నా శ్వాస తిరిగి రావడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. యువరాజ్ సింగ్ జూన్ 2019 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. రెండుసార్లు ప్రపంచకప్ విజేత యువరాజ్ ఈ ఏడాది జరిగే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) టోర్నమెంట్‌లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ఏడాది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యువీ సన్నద్ధమవుతున్నాడు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సంబురాల సందర్భంగా సెప్టెంబర్‌లో ఈ ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఇండియా మహారాజా జట్టుకు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ 2019 ప్రపంచ కప్ విజేత ఇంగ్లీష్ కెప్టెన్ ఓన్ మోర్గాన్ నేతృత్వంలోని వరల్డ్ జెయింట్స్ జట్టుతో జరుగుతుంది.