IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?

|

Feb 03, 2022 | 1:31 PM

KL Rahul: ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ (India vs West India ODI) ప్రారంభం కానుంది.

IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?
kl rahul
Follow us on

Indian Cricket Team: జనవరి 6న భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(KL Rahul) ఆడడం లేదు. అహ్మదాబాద్ మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. తన సోదరి పెళ్లి కారణంగా భారత్-వెస్టిండీస్(India vs West Indies ODI) సిరీస్‌లోని తొలి వన్డేలో కేఎల్ రాహుల్ ఆడడని వార్తలు వస్తున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పరంగా కేఎల్ రాహుల్ మొదటి వన్డేకు దూరంగా ఉన్నారని గతంలో భావించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు టీమిండియాను ప్రకటించినప్పుడు, రెండవ వన్డే నుంచి కేఎల్ రాహుల్ టీమిండియాతో ఉంటాడని బీసీసీఐ కూడా వెల్లడించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

కలసిరాని కెప్టెన్సీ..
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ గైర్హాజరీతో అతడు ఈ బాధ్యతలు చేపట్టాడు. అయితే, కెప్టెన్‌గా అతని ఆరంభం బాగాలేకపోవడంతో వన్డే సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో ఓడిపోయింది. అంతకుముందు టెస్టు సిరీస్ సందర్భంగా ఓ మ్యాచ్‌లో కెప్టెన్సీని కూడా చేపట్టాడు. ఇందులోనూ భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

రాహుల్‌కి బదులు మిడిలార్డర్‌లో ఎవరు వస్తారు?
తొలి వన్డేలో కేఎల్ రాహుల్ ఆడకపోతే మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ లేదా దీపక్ హుడాను తీసుకోవచ్చని తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడే అవకాశం ఉంది. కానీ, అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో తొలి వన్డేలో ఆడే అవకాశం లేదు. వన్డే సిరీస్ సమయంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కాకుండా మిడిల్ ఆర్డర్‌లో భాగంగా ఉన్నాడు. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఆడాల్సి ఉంది. అయితే ధావన్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలాడు. శ్రేయాస్, ధావన్‌తో పాటు యువ బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్, స్టాండ్ బై ప్లేయర్ నవదీప్ సైనీ కూడా పాజిటివ్‌గా తేలారు. దీంతో తొలి వన్డేలో రోహిత్ కొత్త భాగస్వామితో ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది.

మయాంక్ ఓపెనింగ్ చేస్తాడా?
మయాంక్ అగర్వాల్ వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టగలడని విశ్వసిస్తోంది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ తర్వాత కోల్‌కతా వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Also Read: Women IPL: మహిళల ఐపీఎల్‌‌పై గంగూలీ కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎలా నిర్వహించనున్నారంటే?

IND vs WI: గవాస్కర్ నుంచి సచిన్ వరకు.. అహ్మదాబాద్‌లో రికార్డుల మోత.. తాజాగా టీమిండియా కూడా..