IND vs WI: ఆయనతో నాకు ఎలాంటి పోలిక లేదు: హార్దిక్ పాండ్యాతో పోలికలపై టీమిండియా ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు
Hardik Pandya-Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ గత కొన్నేళ్లుగా బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌తోనూ టీమ్ ఇండియాకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి విజయాలు అందించాడు.
Hardik Pandya-Shardul Thakur: భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) తన అద్భుతమైన బ్యాటింగ్ బలంతో ఇటీవలి కాలంలో తనను తాను ఆల్ రౌండర్‌గా నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్ నుంచి, దక్షిణాఫ్రికా వరకు శార్దూల్ కీలక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా(Team India)లో కీలకంగా మారాడు. శార్దూల్ ఠాకూర్ రూపంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ వెతుకులాట కూడా ముగిసినట్లేనని మాజీలు కూడా అంటున్నారు. శార్దూల్ ఠాకూర్ తనను తాను మంచి ఆల్ రౌండర్‌గా నిరూపించుకుంటుండగా.. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) భవితవ్యం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈమేరకు శార్దుల్ మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదని పేర్కొన్నాడు.
శార్దూల్ ఠాకూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి పంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేలు, మూడు T20 మ్యాచ్‌ల కోసం తన మిగిలిన సహచరులతో కలిసి అహ్మదాబాద్ చేరుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ పరిమిత ఓవర్లలో కూడా గొప్ప ఆల్ రౌండర్ అని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు.
జెన్‌విన్ ఆల్ రౌండర్‌గా భావిస్తున్నా.. శార్దూల్ ఠాకూర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ‘నన్ను జెన్‌విన్ ఆల్ రౌండర్‌గా భావిస్తున్నాను. అవకాశం దొరికినప్పుడల్లా నన్ను నేను నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. బ్యాట్స్‌మన్ ఏడవ స్థానంలో పరుగులతో సహకారం అందించినప్పుడల్లా, అది భాగస్వామ్యాలను నిర్మించడంలో సహాయపడుతుంది. జట్టును మంచి స్కోరుకు అందించినట్లవుతుంది. ఇది ఇరు జట్లకు పెద్ద తేడాగా మారుతుంది” అని తెలిపాడు.
శార్దూల్ ఠాకూర్‌ను హార్దిక్ పాండ్యాతో పోల్చుతూనే ఉన్నారు.. అయితే హార్దిక్‌కి తనతో ఎలాంటి పోటీ లేదని శార్దూల్ అభిప్రాయపడ్డాడు. శార్దూల్ మాట్లాడుతూ, ‘హార్దిక్ త్వరలో ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తాడు. మా ఇద్దరి బ్యాటింగ్ విధానం వేరు. హార్దిక్ ఐదు లేదా ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. నేను ఏడు లేదా ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాను. కాబట్టి మా మధ్య ఎలాంటి పోటీ ఉండదు. అతని స్థానంలో నేను తీసుకోవాలనే ఆలోచన లేదు. నాకు తెలిసినంత వరకు, అతను ఎల్లప్పుడూ నాకు మద్దతుగానే ఉన్నాడు. తన అనుభవాలను నాతో పంచుకుంటున్నాడు. నేను కూడా అదే చేశాను. పరిమిత ఫార్మాట్‌లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు వస్తున్నారంటే అది జట్టుకు ఎంతో మేలు చేస్తుంది” అని శార్దులు పేర్కొన్నాడు.
బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టం.. తన బ్యాటింగ్ గురించి చెబుతూ.. ‘ఈ టాలెంట్ నాలో ముందే ఉంది. అయితే, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో మధ్యలో బ్యాటింగ్ చేయడానికి పెద్దగా అవకాశం లేదు. నాకు భారత జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు, నేను జట్టులోని ఇతర బౌలర్ల కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాను. మాజీ కోచ్ రవిశాస్త్రి వంటి పాత టీమ్ మేనేజ్‌మెంట్ సహచరులు నన్ను చూసి ఏడు లేదా ఎనిమిదో నంబర్‌లో అవకాశం ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సహకారం చాలా ముఖ్యం. చాలా ఏళ్లుగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు అద్భుతంగా రాణించాయని మనకు తెలుస్తుంది” అని తెలిపాడు.
Also Read: IND VS WI: ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ.. లిస్టులో ముగ్గురు యువ ప్లేయర్లు.. లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కనుంది?