
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా 41(23 బంతులు, 1 ఫోర్లు, 4 సిక్సులు), అక్షర్ పటేల్ 31(20 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో కీలక భాగస్వామ్యం (68 పరుగులు, 35 బంతులు) అందించి, డీసెంట్ స్కోర్ అందించారు.
29 పరుగుల వద్ద కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. మెండిస్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి వికెట్ వెనుక మధుశంక క్యాచ్ పట్టాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ 37, సంజు శాంసన్ 5, సూర్యకుమార్ యాదవ్ 7, శుభ్‌మన్ గిల్ 7 పరుగుల వద్ద ఔటయ్యారు. మహేశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనంజయ్ డిసిల్వా, వనిందు హసరంగా, దిల్షాన్ మధుశంకలకు ఒక్కో వికెట్ దక్కింది.
5⃣0⃣-run stand! ? ?
A quickfire half-century partnership between @HoodaOnFire & @akshar2026 ? ?
Follow the match ▶️ https://t.co/uth38CaxaP #INDvSL pic.twitter.com/gJAxwL6j2r
— BCCI (@BCCI) January 3, 2023
భారత్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..