India Vs South Africa: కేప్ టౌన్ వన్డేలో ఓటమిని చవిచూసిన టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనను చాలా నిరాశాజనకంగా ముగిసింది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. వన్డే సిరీస్ (India vs South Africa ODI Series) లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దక్షిణాఫ్రికా 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఓటమి టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఎందుకంటే ప్రస్తుత టీం చాలా బలమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సన్నద్ధమైంది. అయినప్పటికీ, భారత్ గెలవలేకపోయింది.
మూడో వన్డే (India vs South Africa 3rd ODI) లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్‌లో 283 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టులో దీపక్ చాహర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(Virat Kohli) అర్ధ సెంచరీలు చేసినప్పటికీ , వారు జట్టును గెలవలేకపోయారు . టీమ్ ఇండియా చేసిన ఈ 5 తప్పులే ఓటమిని అందించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మిడిలార్డర్ వైఫల్యం..
టీమిండియా ఓటమికి మొదటి కారణం మిడిలార్డర్ వైఫల్యమే. వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి చక్కటి సహకారం అందించినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు రాణించలేకపోయారు. పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకోలేదు. రెండు మ్యాచ్‌ల్లో వెంకటేష్ అయ్యర్ బ్యాట్ మౌనంగానే ఉండిపోయింది.
మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు..
మిడిల్ ఆర్డర్ పేలవంగా బ్యాటింగ్ చేసిన తీరు ఓ కారణమైతే, మిడిల్ ఓవర్లలో బౌలర్లు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. మూడు మ్యాచ్‌ల ప్రారంభంలోనే టీమ్ ఇండియా తొలి 2-3 వికెట్లను త్వరగా చేజార్చుకుంది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ భారత బౌలర్లను బలహీనతలను సొమ్ము చేసుకుంది. టెంబా బావుమా, రాసి వాన్ డెర్ డస్సెన్ కలిసి భారత జట్టు ఓటమిని నిర్ణయించారు. అదే సమయంలో, ఓపెనింగ్‌లో, క్వింటన్ డి కాక్ రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ కొట్టి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు.
బ్యాట్స్‌మెన్ బాధ్యతారహిత్య వైఖరి..
వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోవడం కనిపించింది. ముఖ్యంగా రిషబ్ పంత్ రాంగ్ టైమ్‌లో చాలా బాధ్యతారహిత్యమైన షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోయాడు. శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ కూడా ఇలానే చేసి నిరాశ పరిచారు.
ప్లేయింగ్ XIలో మార్పులు..
తొలి రెండు వన్డేల్లో టీమ్‌ఇండియా కాంబినేషన్ అనూహ్యంగా ఉంది. భారత జట్టు కేవలం 5 మంది బ్యాట్స్‌మెన్లతో మైదానంలోకి ప్రవేశించడం కనిపించింది. ప్లేయింగ్ XIలో వెంకటేష్ అయ్యర్ వంటి అనుభవం లేని ఆల్ రౌండర్‌ను చేర్చారు. ఇది కాకుండా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌లపై కూడా చాలా బ్యాటింగ్ భారం పడింది.
కెఎల్ రాహుల్ పేలవమైన కెప్టెన్సీ..
రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్సీని నిరూపించుకుంటాడు అనుకుంటే కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. విరాట్, రోహిత్‌లా ఆకట్టుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా ఎనర్జీ చాలా తక్కువగా కనిపించింది.
Also Read: IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..
IND vs SA: సౌతాఫ్రికా 288 పరుగులకు ఆలౌట్.. సెంచరీతో చెలరేగిన క్వింటన్ డి కాక్..