IND vs PAK T20 WC Result: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. సూపర్ 8 చేరిన సూర్యసేన

India vs Pakistan Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగించింది. తాజాగా ఆదివారం కొలంబో మైదానంలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించి, ప్రపంచకప్ లో తన ఆధిక్యతను 8 విజయాలకు పెంచుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 18 ఓవర్లకు 114 పరుగులకు ఆలౌట్ అయింది.

IND vs PAK T20 WC Result: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. సూపర్ 8 చేరిన సూర్యసేన
Ind Vs Pak Result

Updated on: Feb 15, 2026 | 10:22 PM

India vs Pakistan Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశాడు. సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.