
India vs Pakistan T20 World Cup Clash: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టికెట్ల రెండో దశ అమ్మకాలు బుధవారం (జనవరి 14) సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా వెబ్‌సైట్‌పైకి రావడంతో సర్వర్లు మొరాయించాయి.
అధికారిక టికెటింగ్ పార్టనర్ అయిన ‘బుక్ మై షో’ (BookMyShow) ద్వారా టికెట్లు అందుబాటులోకి రాగానే, ట్రాఫిక్ అనూహ్యంగా పెరిగిపోయింది. లక్షలాది మంది లాగిన్ అవ్వడానికి ప్రయత్నించడంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్లాట్‌ఫారమ్ క్రాష్ అయింది. చాలా మంది యూజర్లకు ట్రాన్సాక్షన్స్ విఫలమవ్వడం, ‘టెక్నికల్ ఎర్రర్’ అని రావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
టికెట్ల ధరలు: అభిమానులకు క్రీడలను మరింత చేరువ చేసేందుకు ఐసీసీ ఈసారి అతి తక్కువ ధరలకే టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.
భారత్‌లో: టికెట్ ధరలు కేవలం రూ. 100 నుంచి ప్రారంభం.
శ్రీలంకలో: టికెట్ ధరలు LKR 1000 నుంచి ప్రారంభం.
భారత్-పాక్ మ్యాచ్: ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ప్రారంభ టికెట్ ధర సుమారు LKR 1500 (దాదాపు రూ. 430) గా నిర్ణయించారు.
భారత జట్టు షెడ్యూల్: భారత్ తన గ్రూప్-ఏ మ్యాచ్‌లను క్రింది షెడ్యూల్ ప్రకారం ఆడనుంది:
ఫిబ్రవరి 7: భారత్ vs యూఎస్ఏ (ముంబై)
ఫిబ్రవరి 12: భారత్ vs నమీబియా (ఢిల్లీ)
ఫిబ్రవరి 15: భారత్ vs పాకిస్థాన్ (కొలంబో)
ఫిబ్రవరి 18: భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
మొత్తం 20 జట్లతో జరగనున్న ఈ మెగా ఈవెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..