IND vs PAK: ఆసియా కప్-2022 కోసం భారత జట్టు దుబాయ్ చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తన సన్నాహాలను ప్రారంభించింది. గురువారం నెట్స్‌లో టీమ్‌ఇండియా చెమటోడ్చింది. ఈ సమయంలో భారతదేశ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఇందుకోసం ప్రాక్టీస్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాడు.
సూర్యకుమార్ నెట్స్‌లో ధీటుగా బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు బాదేశాడు. ఫాస్ట్ బౌలర్ల నుంచి స్పిన్నర్ల వరకు అందరిని బాదేశాడు. ఈ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఆసియా కప్‌లో జట్టుకు ప్రధాన కోచ్‌గా వెళ్లాడు. లక్ష్మణ్ ఆటగాళ్లపై నిఘా పెంచాడు. సూర్యకుమార్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను paktv.tv తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఆసియాకప్‌లో ఆగస్టు 28న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్.
చప్పట్లు కొడుతూ అశ్విన్ ఎంకరేజ్..
సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అతనికి బౌలింగ్ చేశారు. ఆఫ్-స్టంప్ వెలుపల అశ్విన్ వేసిన బంతిని, సూర్యకుమార్ మిడ్ వికెట్ వైపు గాలిలో ఆడినట్లు వీడియో ప్రారంభంలో చూడవచ్చు. అశ్విన్ బంతిని కాసేపు చూసి సూర్యకుమార్ కొట్టిన షాట్‌కు క్లాప్ కొట్టాడు. అతను రవి బిష్ణోయ్ బంతిని కూడా అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ చాలా సేపు బ్యాటింగ్ చేసి బంతిని ఎక్కువగా బాదుతున్నట్లు వీడియోలో చూడొచ్చు.
వసీం అక్రమ్ ఇష్టపడిన ప్లేయర్..
సూర్యకుమార్ చాలా కాలం పాటు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో బాగా రాణించి, టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ సమయంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుడిగా నిరంతరం తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నాడు. సూర్య బ్యాటింగ్‌ను ఇష్టపడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, పాకిస్తాన్‌లో కూడా చాలా మంది అతన్ని ఇష్టపడతారు. ఈ రోజుల్లో పరిమిత ఓవర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూడటమే తనకు ఇష్టమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఇటీవల చెప్పుకొచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా ఉన్నప్పటి నుంచి అక్రమ్‌కు సూర్యకుమార్ తెలుసు. ముంబై ఇండియన్స్‌కు ఆడే ముందు సూర్యకుమార్ కోల్‌కతా తరపున ఐపీఎల్ ఆడాడు.