India vs Pakistan Match Highlights: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాక్ ఘన విజయం.. 5 వికెట్ల తేడాతో..
Asia Cup 2022, India vs Pakistan Match Highlights: 2022లో యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి మ్యాచ్ సూపర్-4 దశలో ఉంది.
India vs Pakistan Match Highlights: ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయాన్ని సాధించింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా పాక్ ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ ఫోర్ దశలో భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని పాక్ బ్యాట్స్‌మెన్ చివరి బంతి వరకు పోరాడి చేధించారు. మహ్మద్ రిజ్వాన్ (71), మహ్మద్ నవాజ్ (42) పరుగులతో పాకిస్థాన్ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు.
ప్రత్యేక క్లబ్‌లో విరాట్ కోహ్లీ..
టీ20 ఇంటర్నేషనల్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 97 సిక్సర్లు కొట్టాడు. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ నుంచి మూడు సిక్సర్లు బాదితే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తయినట్లే. ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విరాట్ బ్యాట్‌లో 4 సిక్సర్లు వచ్చాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 9 మంది బ్యాట్స్‌మెన్లు 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టారు.
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా
Key Events
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు 16వ సారి తలపడనున్నాయి. భారత్ 9, పాక్ 5 మ్యాచ్‌లు గెలుపొందాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
ఆసియా కప్ 2022లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండోసారి తలపడనున్నాయి. సెప్టెంబర్ 4న ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతోంది.
LIVE Cricket Score & Updates
-
పాక్ విజయం..
చివరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారి పోతోందని అనుకుంటున్న తరుణంలో పాక్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో పాక్ విజయాన్ని అందుకుంది. రిజ్వాన్ 71 పరుగులు, నవాజ్ (42) పరుగులతో రాణించడంతో భారత్ ఇచ్చిన 182 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేధించింది.
-
చివరి ఓవర్..
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చివరి అంకానికి చేరింది. పాక్ విజయానికి లాస్ట్ ఓవర్‌లో 7 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఖష్దిల్ షా (13), అసిఫ్ అలి (12) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
-
-
సన్నగిల్లుతోన్న పాక్ ఆశలు..
రిజ్వాన్, నవాజ్‌లు క్రీజులో ఉన్నంత సేపు విజయంపై ఆశలు సజీవంగా ఉండగా వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టిన తర్వాత పాక్ ఆశలు సన్నగిల్లాయి. పాకిస్థాన్ ప్రస్తుతం 9 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది.
-
బిగ్ వికెట్..
పాకిస్థాన్ ఒక్కసారిగా కష్టాల్లోకి జారుకుంది. దూకుడుగా ఆడుతున్న నవాజ్ వెనుదిరిగిన వెంటనే రిజ్వాన్ రూపంలో పాక్ మరో భారీ వికెట్‌ను కోల్పోయింది. 51 బంతుల్లో 71 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్ అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం పాక్ విజయానికి ఇంకా 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉంది.
-
పాక్ స్పీడ్‌కు బ్రేక్..
జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న పాకిస్థాన్ స్కోర్‌బోర్డ్‌కు భువనేశ్వర్ బ్రేక్ వేశాడు. కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ భువనేశ్వర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పాక్ గెలుపునకు ఇంకా 26 బంతుల్లో 45 పరగులు చేయాల్సి ఉంది.
-
-
చెలరేగి ఆడుతోన్న రిజ్వాన్, నవాజ్..
రిజ్వాన్, నవాజ్‌లు చెలరేగి ఆడుతున్నారు. వరుస బౌండరీలతో స్కోరు బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. 15 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 135 పరగులు సాధించింది. పాక్ గెలవడానికి ఇంకా 30 బంతుల్లో 47 పరుగులు చేయాల్సి ఉంది. రిజ్వాన్ 44 బంతుల్లో 62 పరుగులు, నవాజ్ కేవలం 18 బంతుల్లోనే 42 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.
-
దూసుకెళ్తోన్న పాక్ స్కోర్ బోర్డ్..
మహ్మద్ రిజ్వాన్‌కు నవాజ్ తోడుకావడంతో పాక్ స్కోర్ బోర్డ్ దూసుకుపోతోంది. నవాజ్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే 33 పరుగులు సాధించాడు. ఇక పాకిస్థాన్ జట్టు చివరి 5 ఓవర్లలో 52 పరగులు సాధించడం విశేషం. ప్రస్తుతం క్రీజులో నవాజ్ (33), రిజ్వాన్ (55) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
-
దంచి కొడుతోన్న రిజ్వాన్..
మహ్మద్ రిజ్వాన్ ధీటుగా ఆడుతున్నాడు. జట్టును విజయ తీరాలకు చేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పాకిస్థాన్ విజయం సాధించాలంటే 45 బంతుల్లో పరుగులు 81 చేయాల్సి ఉంది.
-
10 ఓవర్లకు పాక్ స్కోర్ ఎంతంటే..
పాకిస్థాన్ స్కోర్ బోర్డ్ రెండు వికెట్ల నష్టానికి 76 పరగుల వద్ద కొనసాగుతోంది. పాక్ విజయం సాధించాలంటే ఇంకా 60 బంతుల్లో 106 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్ (35), నవాజ్ (11) పరుగులతో కొనసాగుతున్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన పాక్..
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చాహల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన ఫఖర్ జమాన్ పెవిలియన్ బాట పట్టాడు. పాక్ గెలవాలంటే ఇంకా 67 బంతుల్లో 119 పరుగులు చేయాల్సి ఉంటుంది.
-
IND vs PAK: 6 ఓవర్లకు పాక్ స్కోర్ 44/1
పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ టీం ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. రిజ్వాన్ 24, జమాన్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
IND vs PAK: తొలి వికెట్ కోల్పోయిన పాక్..
పాకిస్తాన్ టీం బాబర్ అజాం రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది. బాబర్ కేవలం 10 బంతులు ఆడి 14 పరుగులు చేసి, రవి బిష్ణోయ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.దీంతో ప్రస్తుతం పాక్ 3.4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది.
-
IND vs PAK: 20 ఓవర్లకు టీమిండియా స్కోర్ 181/7
20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ముందు 182 పరుగుల టార్గెట్ ను ఉంచింది. కోహ్లీ 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
-
IND vs PAK: 7వ వికెట్ డౌన్..
టీమిండియా విరాట్ కోహ్లీ రూపంలో ఏడో వికెట్ ను కోల్పోయింది. కోహ్లీ 60 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 173 పరుగుల వద్ద ఏడో వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: 6వ వికెట్ డౌన్..
టీమిండియా దీపక్ హుడా రూపంలో ఆరో వికెట్ ను కోల్పోయింది. దీపక్ 16 చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 168 పరుగుల వద్ద ఆరో వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: 18 ఓవర్లకు టీమిండియా స్కోర్ 164/5
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కోహ్లీ 53, దీపక్ హుడా 15 పరుగులతో ఆడుతున్నారు.
-
IND vs PAK: 15 ఓవర్లకు టీమిండియా స్కోర్ 135/5
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కోహ్లీ 40, దీపక్ హుడా 0 పరుగులతో ఆడుతున్నారు.
-
IND vs PAK: 5వ వికెట్ డౌన్..
టీమిండియా హార్దిక్ పాండ్యా రూపంలో ఐదో వికెట్ ను కోల్పోయింది. హార్దిక్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో 131 పరుగుల వద్ద ఐదో వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: 4వ వికెట్ డౌన్..
టీమిండియా రిషబ్ పంత్ రూపంలో నాలుగో వికెట్ ను కోల్పోయింది. పంత్ 14 పరుగులు(12 బంతులు, 2 ఫోర్లు)చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 126 పరుగుల వద్ద నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: 10 ఓవర్లకు టీమిండియా స్కోర్ 93/3
10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పలోయి 93 పరుగులు చేసింది. కోహ్లీ 18, పంత్ 1 పరుగులతో ఆడుతున్నారు.
-
IND vs PAK: మూడో వికెట్ డౌన్..
టీమిండియా సూర్యకుమార్ యాదవ్ రూపంలో మూడో వికెట్ ను కోల్పోయింది. సూర్య 13 పరుగులు(10 బంతులు, 2 ఫోర్లు)చేసి భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. దీంతో 91 పరుగుల వద్ద మూడో వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: 7 ఓవర్లకు టీమిండియా స్కోర్ 71/2
7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పలోయి 71 పరుగులు చేసింది. సూర్య 5, కోహ్లీ 5 పరుగులతో ఆడుతున్నారు.
-
IND vs PAK: రెండో వికెట్ డౌన్..
టీమిండియా కేఎల్ రాహుల్ రూపంలో రెండో వికెట్ ను కోల్పోయింది. రాహుల్ 28 పరుగులు(20 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు)చేసి భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. దీంతో 62 పరుగుల వద్ద రెండో వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: తొలి వికెట్ డౌన్..
టీమిండియా తొలి వికెట్ ను కోల్పోయింది. రోహిత్ 28 పరుగులు(16 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు)చేసి భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. దీంతో 54 పరుగుల వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు.
-
IND vs PAK: హాఫ్ సెంచరీ పూర్తి
టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడడంతో కేవలం 26 బంతుల్లోనే 50 పరుగులు సాధించింది. 4.4 ఓవర్లకు రోహిత్ 27, కేఎల్ రాహుల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
ధాటిగా ఆడుతోన్న ఓపెనర్లు..
టీమిండియా ఓపెనర్లు రోహిత్, రాహుల్ ధాటిగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 34/0. రాహుల్ (18), రోహిత్ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
హిట్ మ్యాన్ స్పెషల్ ఇన్నింగ్స్..
తొలి ఓవర్ నుంచి టీమిండియా సారధి రోహిత్ శర్మ తన మార్క్ ఇన్నింగ్స్ తో దంచి కొట్టాడు. తొలి ఓవర్ పూర్తయ్యే సరికి 11 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ 10, రాహుల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
-
IND vs PAK: టీమిండియా ప్లేయింగ్ XI..
భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
-
IND vs PAK: పాక్ ప్లేయింగ్ XI..
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా
-
IND vs PAK: టాస్ గెలిచిన పాక్..
టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
-
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ 16వ సారి ఢీ..
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు 16వ సారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 15 మ్యాచ్‌ల్లో భారత్ 9 విజయం సాధించగా, పాకిస్థాన్ 5 మ్యాచ్‌లు గెలుపొందగా, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. టీ20 ఆసియాకప్‌లో ఇప్పటి వరకు పాకిస్థాన్‌తో భారత్ రెండుసార్లు తలపడి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.
-
IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్థాన్ రెండోసారి ముఖాముఖి పోరు..
ఆసియా కప్ 2022లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండోసారి తలపడనున్నాయి. సెప్టెంబర్ 4న ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్-ఎలో రెండు జట్లూ టాప్-2లో నిలిచాయి.
Published On - Sep 04,2022 6:36 PM