‎IND vs PAK: ఇకనుంచి ప్రతి ఏటా భారత్-పాకిస్తాన్ మ్యాచులు.. ఐసీసీ ముందు పీసీబీ సరికొత్త ప్రతిపాదన..!

|

Jan 12, 2022 | 7:24 PM

ICC: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాల కారణంగా ఇరు జట్ల మధ్య ఎలాంటి సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి.

‎IND vs PAK: ఇకనుంచి ప్రతి ఏటా భారత్-పాకిస్తాన్ మ్యాచులు.. ఐసీసీ ముందు పీసీబీ సరికొత్త ప్రతిపాదన..!
Ind Vs Pak
Follow us on

India vs Pakistan: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే క్రికెట్‌ మ్యాచ్‌ను చూసేందుకు ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌, పాకిస్థాన్‌(India vs Pakistan)ల మధ్య దౌత్య సంబంధాల కారణంగా ఇరు జట్ల మధ్య ఎలాంటి సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ (ICC)ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా భారత్-పాకిస్థాన్ మధ్య సిరీస్‌కు సంబంధించి పెద్ద చొరవ తీసుకున్నారు. ఐసీసీ ముందు ఒక ప్రతిపాదనను ఉంచనున్నాడు. ఇది అంగీకరిస్తే, ప్రతి సంవత్సరం రెండు దేశాల మధ్య టీ20(T20 Series) మ్యాచ్‌ల సిరీస్‌ను ఏర్పాటు చేయాలంటూ పేర్కొంటున్నాడు.

రమీజ్ రాజా ఐసీసీకి నాలుగు దేశాల సిరీస్‌ను ప్రతిపాదించనున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించాలంటూ విన్నవించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ఉంటాయి. ఐసీసీ తదుపరి సమావేశంలో పీసీబీ చీఫ్ ఈ సిరీస్‌ను ప్రతిపాదించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

రమీజ్ రాజా ట్వీట్ చేస్తూ, ‘భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య 4 దేశాల మధ్య ప్రతి సంవత్సరం టీ20 టోర్నమెంట్ నిర్వహించాలని మేం పరిశీలిస్తున్నాం. దీని ప్రతిపాదన త్వరలో ఐసీసీ ముందు ఉంచుతాం. ఈ టోర్నమెంట్ మొత్తం నాలుగు దేశాల్లో జరుగుతుంది’అంటూ చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచ కప్‌లో చివరిసారిగా ఇరు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 2021 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌పై భారత్‌ జట్టు ఘోరంగా ఓడిపోయింది. 1992 వన్డే ప్రపంచ కప్ తర్వాత, విరాట్ కోహ్లీ భారతదేశానికి మొదటి కెప్టెన్ అయ్యాడు. అతని కెప్టెన్సీలో టీం ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. 1992 నుంచి 2021 వరకు జరిగిన టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో భారతదేశం-పాకిస్తాన్ 13 సార్లు తలపడగా, ఇందులో భారత్ 12 విజయాలు సాధించగా, పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచింది.

Also Read: IND vs SA: సౌతాఫ్రికాలో నం.1 ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..!

తొలి ఓవర్లో ఊచకోత.. కట్ చేస్తే సీన్ రివర్స్.. 17 పరుగులిచ్చి 6 వికెట్లతో సత్తా చాటిన మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్

IND vs SA: సౌరవ్ గంగూలీ రికార్డుకు బీటలు.. నం.1 ఆసియా కెప్టెన్‌గా మారిన భారత టెస్ట్ సారథి..!