T20 World Cup 2021, IND vs NZ: కీలక మ్యాచులో భారత్ మరోసారి తడబడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ టోర్నీలో తన రెండో మ్యాచులోనూ పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
టీమిండియా కీలక మ్యాచులో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను పంపించింది. అయితే ఈ మార్పు పెద్దగా ఫలించలేదు. ఇషాన్ కిషన్ (4) ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్ (18 పరుగులు, 16 బంతులు, 3 ఫోర్లు) సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి, పేలవ ఆటతీరును కనబరిచింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన సమయంలో రోహిత్ శర్మ (14 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో టోర్నీలో ఆడుతోన్న రెండో మ్యాచులో కూడా టీమిండియా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తోంది.
ఆ వెంటనే కోహ్లీ (9 పరుగులు) కూడా ఓ రాంగ్ షాట్ ఆడే క్రమంలో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పంత్ 8, పాండ్యా 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇక న్యూజిలాండ్ బౌలర్లలో సోథీ 2 వికెట్లు, బౌల్ట్, సౌథీ చెరో వికెట్ పడగొట్టారు.