IND vs NZ: శుభ్‎మన్ గిల్‎కు మంచి భవిష్యత్తు ఉంది.. టెస్ట్ క్రికెట్‌లో అతడు కీలకంగా ఉంటాడు..

|

Nov 25, 2021 | 8:43 PM

కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గురువారం ప్రశంసలు కురిపించాడు. శుభ్‌మన్ గిల్ 93 బంతుల్లో 52 పరుగులతో భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు...

IND vs NZ: శుభ్‎మన్ గిల్‎కు మంచి భవిష్యత్తు ఉంది.. టెస్ట్ క్రికెట్‌లో అతడు కీలకంగా ఉంటాడు..
Shubman Gill
Follow us on

కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గురువారం ప్రశంసలు కురిపించాడు. శుభ్‌మన్ గిల్ 93 బంతుల్లో 52 పరుగులతో భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే లంచ్ విరామం తర్వాత రెండో సెషన్‌లోని మొదటి ఓవర్‌లో ఔటయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్‌కు అరంగేట్రం చేసినప్పటి నుంచి అతడు ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్‌కు చెందిన స్టైలిష్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు నాలుగు అర్ధ సెంచరీలతో 31 కంటే ఎక్కువ సగటుతో ఉన్నాడు.

” గిల్ నిజంగా మంచి కెరీర్‌ను కలిగి ఉంటాడని నేను నిజంగా భావిస్తున్నాను, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఎందుకంటే అతను చాలా కీలకంగా ఉంటాడని నేను భావిస్తున్నాను, ముఖ్యంగా మనం విదేశాలలో పర్యటిస్తూ ఉంటే. అతను తన ప్రారంభ కదలికతో అత్యుత్తమ బ్యాక్‌ఫుట్ గేమ్‌ను ఆడాడను” అని స్టార్ స్పోర్ట్స్‌లో పఠాన్ అన్నాడు. గిల్ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు స్పిన్నర్లను ఎదుర్కొన్న విధానం చాలా బాగుంది.” అని పఠాన్ చెప్పాడు.

“అతను ఒక యువకుడు. బ్యాటింగ్ విషయానికి వస్తే అతను చాలా ప్రతిభావంతుడు. అతను తన వద్ద ఉన్న చిన్న సాంకేతిక లోపాలను, ప్రత్యేకించి పూర్తి డెలివరీకి వ్యతిరేకంగా ఎలా ఆడాలో ప్రయత్నిస్తున్నాడు. అతను ఫాస్ట్ బౌలర్లకు ఎదుర్కొనేందు పిచ్ ముందుకు వస్తున్నాడు, స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా ఆకట్టుకుంది. అతను బంతిని ఆలస్యంగా ఆడుతున్నాడు’ అని పఠాన్ పేర్కొన్నాడు. గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి గిల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. అయ్యర్, జడేజా ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు.

Read Also.. IND vs NZ: బంతి అలా వస్తుందని అనుకోలేదు.. జేమీసన్ బౌలింగ్‎పై గిల్ స్పందన..