India vs New Zealand: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ.. కాన్పూర్‌ టెస్ట్‌కి కీలక ఆటగాడు దూరం..

| Edited By: Anil kumar poka

Nov 23, 2021 | 4:57 PM

KL Rahul:T20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత నవంబర్ 25 నుంచి మొదటి టెస్ట్‌ మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ కాన్పూర్ వేదికగా

India vs New Zealand: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ.. కాన్పూర్‌ టెస్ట్‌కి కీలక ఆటగాడు దూరం..
Kl Rahul
Follow us on

KL Rahul:T20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత నవంబర్ 25 నుంచి మొదటి టెస్ట్‌ మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. BCCI వర్గాల సమాచారం ప్రకారం KL రాహుల్ గాయం కారణంగా కాన్పూర్ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఈ టెస్ట్ సిరీస్‌లో ఆడటం లేదు. అలాగే విరాట్ కోహ్లీకి కూడా కాన్పూర్ టెస్ట్‌కు విశ్రాంతి లభించిన విషయం తెలిసిందే.

మంగళవారం కాన్పూర్‌లో జరిగిన నెట్స్‌లో టీమిండియా చెమటోడ్చింది. మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ప్రారంభ నెట్ సెషన్‌కు దిగారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేయలేదు. KL రాహుల్ గాయం తర్వాత ఇప్పుడు మయాంక్ అగర్వాల్, శుభ్‌మాన్ గిల్‌ల ఓపెనింగ్‌ ఆడుతారని తెలుస్తోంది. కాగా కేఎల్ రాహుల్ స్థానంలో ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి రాబోతున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం..!
కాన్పూర్‌లో సూర్యకుమార్ యాదవ్ భీకర బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. చివరి నిమిషంలో సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా బాగుంది. సూర్యకుమార్ 77 మ్యాచ్‌ల్లో 44.01 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా – అజింక్యా రహానే (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్‌ యాదవ్‌, మయాంక్ అగర్వాల్, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (WK), KS భరత్ (WK), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ది కృష్ణ

న్యూజిలాండ్ పూర్తి శక్తితో రంగంలోకి దిగనుంది
టీ20 సిరీస్‌లో కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగిన కివీస్ జట్టు.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో పూర్తి జోరుతో రంగంలోకి దిగబోతోంది. కేన్ విలియమ్సన్, కైల్ జేమ్సన్ తిరిగి జట్టులోకి రానున్నారు. వాగ్నర్, రాస్ టేలర్, టామ్ లాథమ్ వంటి టెస్టు స్పెషలిస్టులు కూడా కాన్పూర్ టెస్టులో ఆడనున్నారు.

న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్, కైల్ జేమ్సన్, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విలియం సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, విల్స్ టేయిలర్, నెయిల్ వాగ్నర్.

జీవితంలో అనేక బాధలతో ఇబ్బందిపడుతున్నారా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..

Two Wheelers: ఈ ఏడాది బైక్‌ల విక్రయాలకు పెద్ద ఎదురుదెబ్బ.. కారణాలు ఇలా ఉన్నాయి..?

ప్రెజర్ కుక్కర్ కొనాలని ఆలోచిస్తున్నారా..! అయితే జాగ్రత్త.. ఈ విషయాలను తెలుసుకోండి..