IND vs NZ 1st Test, Day 2 Highlights: రెండో రోజు ముగిసిన ఆట.. న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..

|

Nov 26, 2021 | 4:47 PM

India vs New Zealand 1st Test Day 2 Highlights: టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీతో శ్రేయాస్ అయ్యర్, అర్థసెంచరీలతో గిల్, జడేజాలు దీంతో న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది.

IND vs NZ 1st Test, Day 2 Highlights: రెండో రోజు ముగిసిన ఆట.. న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..
India Vs New Zealand 1st Test Day 2 Live Score Updates

India vs New Zealand 1st Test Day 2 Highlights: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్‌ యంగ్‌ (75), టామ్‌ లాథమ్‌ (50) పరుగులతో దూసుకుపోతున్నారు. ఇది ఉంటే అంతకు ముందు 258/4 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్కోర్‌తో రెండో రోజు ఆటను జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ప్రారంభించారు. అయితే జడేజా(50 పరుగులు, 112 బంతులు, 6 ఫోర్లు) రెండో రోజు పరుగులేమీ చేయకుండానే సౌతీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ఇద్దరూ కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత సాహా(1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక సౌతీకి వికెట్ సమర్పించుకున్నాడు. తన తొలి సెంచరీ చేసి దూకుడు మీదున్న శ్రేయాస్ అయ్యర్(105 పరుగులు, 171 బంతులు, 13 ఫోర్లు, 2 సిక్సులు) కూడా డ్రింక్స్‌ తరువాత తొలి బంతికే సౌతీకి చిక్కాడు. ఆ తరువాత అక్షర్(3) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఉమేష్ యాదవ్ 10 నాటౌట్, అశ్విన్ 38, ఇషాంత్ శర్మ 0 పరుగులు చేశారు. దీంతో టీమిండియా మొత్తంగా 390 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 5, కైల్ జైమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ 52 పరుగులతో ఆడాడు. రెండో సెషన్‌లో కివీ బౌలర్లు భారత్‌ను ఇబ్బంది పెట్టినా, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా తమ తొలి మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.

అయ్యర్ అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించి 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు సెంచరీ పూర్తి చేసి ఘనమైన ఆరంభాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. అదే సమయంలో జడేజా 50 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు.

మరిన్ని ఎక్కువ పరుగులు తన ఖాతాలో వేసుకుని జట్టుకు బలమైన స్కోరు అందించాలని భావిస్తున్నారు. కివీ బౌలర్లు టీమ్ ఇండియాను భారీ స్కోరు చేయకుండా ఆపాలని చూస్తున్నారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Nov 2021 04:45 PM (IST)

    ధీటుగా ఆడిన ఓపెనర్లు..

    తొలి టెస్ట్‌ రెండో రోజు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు విల్‌ యంగ్‌, టామ్‌ లూథమ్‌ ధీటుగా ఆడారు. దీంతో జట్టు వికెట్‌ కోల్పోకుండా 129 పరుగులు చేయగలిగింది. ఇద్దరు హాఫ్‌ సెంచరీతో క్రీజులో పాతుకుపోయారు. ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. ఇలా విల్‌ యంగ్ ఏకంగా 180 బంతులు ఆడి 75 పరుగులు సాధిస్తే.. టామ్‌ లూథమ్‌ 165 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

  • 26 Nov 2021 04:41 PM (IST)

    రెండో రోజు ఆట ముగిసింది.. ఒక్క వికెట్ కోల్పోని న్యూజిలాండ్‌..

    తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్‌ యంగ్‌ (75), టామ్‌ లాథమ్‌ (50) పరుగులతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే రెండో రోజు ఆట ప్రారంభంలో 258/4 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన టీమిండియా 345 పరగులకు ఆలౌటైంది.


  • 26 Nov 2021 03:33 PM (IST)

    100 మార్కును దాటేసిన న్యూజిలాండ్‌..

    కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అయితే అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 100 మార్కును దాటేసింది. ప్రస్తుతం 42 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 109 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో టామ్‌ లథమ్‌ (39), విల్‌ యంగ్‌ (66) పరుగల వద్ద కొనసాగుతున్నారు.

  • 26 Nov 2021 02:10 PM (IST)

    50 పరుగులు దాటిన న్యూజిలాండ్ స్కోర్..

    తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ టీం భారత బౌలర్లను సమర్థంగా అడ్డుకుంటున్నారు. వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ 22, విల్ యంగ్ 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో కివీస్ టీం స్కోర్ 50 పరుగులు దాటింది.

  • 26 Nov 2021 12:56 PM (IST)

    మొదలైన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్

    రెండవ రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఓపెనర్లుగా విల్ యంగ్, టామ్ లాథమ్ బరిలోకి దిగారు.

  • 26 Nov 2021 12:24 PM (IST)

    345 పరుగులకే ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్..

    లంచ్ తరువాత వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది.

  • 26 Nov 2021 12:15 PM (IST)

    తొమ్మిదో వికెట్ డౌన్..

    రవిచంద్రన్ అశ్విన్ (38 పరుగులు, 56 పరుగులు, 5 ఫోర్లు) రూపంలో టీమిండియా లంచ్ తరువాత రెండో బంతికే వికెట్‌ను కోల్పోయింది. దీంతో భారత్ 339 పరుగుల వద్ద అశ్విన్ తొమ్మిదో వికెట్‌‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఉమేష్ యాదవ్ 4, ఇషాంత్ శర్మ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Nov 2021 11:34 AM (IST)

    లంచ్ బ్రేక్..

    లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ 38(53 బంతులు, 5 ఫోర్లు), ఉమేష్ యాదవ్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 5, కైల్ జైమిసన్ 3 వికెట్లు పడగొట్టారు.

  • 26 Nov 2021 11:24 AM (IST)

    330 పరుగులకు చేరిన భారత్ స్కోర్

    భారత్ 8 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్ 32, ఉమేష్ యాదవ్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Nov 2021 10:57 AM (IST)

    ఎనిమిదో వికెట్ డౌన్..

    రెండో రోజు ఆటలో కివీస్ బౌలర్లు ప్రతాపం చూపిస్తున్నారు. ఆట మొదలైన కొద్దిసేపటికే వికెట్లు పడగొడుతూ తమ సత్తా చాటుతున్నారు. దీంతో అక్షర్ పటేల్ (3)కూడా ఆగలేకపోయాడు. ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 5 వికెట్లతో సౌతీ దసుకెళ్తున్నాడు.

  • 26 Nov 2021 10:38 AM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    శ్రేయాస్ అయ్యర్ (105 పరుగులు, 171 పరుగులు, 13 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో భారత్ 305 పరుగుల వద్ద మరో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ 16, అక్షర్ పటేల్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Nov 2021 10:12 AM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా

    రెండో రోజు తొలి సెషన్‌లో కివీస్ బౌలర్లు కీలకంగా రాణిస్తున్నారు. దీంతో టీమిండియా వరుసగా రెండు వికెట్లును కోల్పోయింది. సాహా(1) ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

  • 26 Nov 2021 10:09 AM (IST)

    శ్రేయాస్ అయ్యర్ తొలి సెంచరీ..

    రెండో రోజూ కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్.. తన తొలి సెంచరీని పూర్త చేసి ఆకట్టుకున్నాడు. దీంతో డెబ్యూ‌లో సెంచరీ పూర్తి చేసిన 16 వ ఆటగాడిగా నిలిచాడు.

    – అరంగేట్రంలో 16వ భారత ఆటగాడు
    – NZ vs అరంగేట్రంలో 3వ భారతీయుడు

  • 26 Nov 2021 09:47 AM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    రవీంద్ర జడేజా(50 పరుగులు, 112 పరుగులు, 6 ఫోర్లు) రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో భారత్ 266 పరుగుల వద్ద మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే జడేజా పెవిలియన్ చేరాడు.

  • 26 Nov 2021 09:29 AM (IST)

    రెండో రోజు ఆట రెడీ

  • 26 Nov 2021 09:09 AM (IST)

    అయ్యర్ చరిత్ర సృష్టిస్తాడా?

    శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రంలో సెంచరీకి 25 పరుగుల దూరంలో ఉన్నాడు. సెంచరీ పూర్తి చేస్తే చరిత్ర సృష్టిస్తాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతికొద్ది మంది భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో అతనూ ఒకడయ్యే అవకాశం ఉంది. ఇలా చేస్తే టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 16వ భారత క్రికెటర్‌గా నిలవనున్నాడు.

  • 26 Nov 2021 09:06 AM (IST)

    మొదటి గంట చాలా ముఖ్యం..

    భారత బ్యాట్స్‌మెన్‌కు ఓపెనింగ్ అవర్ చాలా కీలకం. తొలిరోజు కూడా కివీస్‌ బౌలర్లు దాదాపు గంటసేపు ఆధిపత్యం ప్రదర్శించి అవకాశం ఉంది. తొలిరోజు కూడా ఇదే తరహాలో సాగడంతో.. నేడు మొదటి గంట ఆట చాలా కీలకంగా మారింది.

  • 26 Nov 2021 09:02 AM (IST)

    కివీస్‌కు తలనొప్పిగా మారిన జడేజా-అయ్యర్ జోడీ..

    తొలిరోజు రెండో సెషన్‌లో కివీస్‌ బౌలర్లు భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు భారత్‌ను మంచి స్థితిలో నిలిపారు. ఈ జోడీ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. రెండో రోజు న్యూజిలాండ్ బౌలర్లు ఈ జోడీని వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చేందుకు ప్రయత్నాలు చేయడంలో నిమగ్నమవుతారు.

  • 26 Nov 2021 08:59 AM (IST)

    అందరి దృష్టి శ్రేయాస్ అయ్యర్‌పైనే..

    కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. ఈ రోజు అందరి దృష్టి యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌పైనే ఉంటుంది. అయ్యర్‌కి ఇది అరంగేట్రం మ్యాచ్‌ కావడంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని.. తొలి సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు.

Follow us on