IND vs NMB Highlights, T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి టీమిండియా గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లో ఘోరపరాజయంతో సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నో అంచనాల నడుమ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన భారత జట్టు అందరినీ నిరాశకు గురి చేసింది. అనంతరం స్కాట్లాండ్‌పై భారీ రన్‌రేట్‌తో గెలిచినప్పటికీ టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గనిస్తాన్ ఓటమితో టీమిండియా ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. దీంతో తాజాగా నమిబియాతో జరగనున్న మ్యాచ్ నామమాత్రంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ నుంచి తప్పుకోవాలని టీమిండియా భావిస్తోంది.
నమిబియా, భారత్ రెండూ సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారనుంది. దీంతో నమీబియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టు తన ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసుకుంది. ఇదిలా ఉంటే భారత్ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచుల్లో రెండు గెలిచి, రెండు ఓడిపోయింది. నమీబియా మాత్రం కేవలం 1 మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకుంది. దీంతో నమీబియా ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలిచి తమ విక్టరీల సంఖ్యను రెండుకు పెంచుకోవాలని యోచిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఉంది. ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే కోహ్లీకి కెప్టెన్‌గా ఈ మ్యా్చ్ చివరిదని చెప్పాలి. దీంతో తన కెరీర్‌లో కీలకమైన మ్యాచ్‌లో కోహ్లీ ఎలాంటి మెరుపులు మెరిస్తారో చూడాలని ఆయన అభిమానులు కూడా ఆసక్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే టీమిండియా కోచ్ రవి శాస్త్రి కూడా ఇది చివరి మ్యాచ్ కావడం విశేషం.
నమీబియా పై భారత్ విజయం సాధించింది. 15.2 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది భారత్. కే ఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేయగా.. సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 25 నాపరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించారు.
టీమిండియా ఆచితూచి పరుగులు చేస్తుంది. ఈ క్రమంలో క్రీజ్ లో ఉన్న కే ఎల్ రాహుల్ అర్ధశతకం పూర్తి చేశాడు. రాహుల్ (50)పరుగులు చేయగా.. సూర్యకుమార్ 25 పరుగులు సాధించాడు భారత్ స్కోర్ 132/1
వందపరుగులు దాటిన భారత్ స్కోర్.. 12 ఓవర్లకు 105/1. క్రీజ్ లో రాహుల్ (41) , సూర్య కుమార్ (8)
పదకొండు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 96/1 క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(7), కే ఎల్ రాహుల్(33) ఉన్నారు.
భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరును పెంచే క్రమంలో కేవలం 37 బంతుల్లోనే 56 పరుగులు సాధించిన రోహిత్.. జాన్ ఫ్రైలింక్ బౌలింగ్‌లో జేన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
నమీబియా ఇచ్చిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ చేలరేగి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 44 పరుగులు సాధించింది. ప్రస్తుతం జట్టులో రోహిత్ శర్మ (37), రాహుల్ (07) పరుగులతో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా బౌలర్లను నమీబియా బ్యాట్స్‌మెన్ గట్టిగానే ఎదుర్కొన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులను సాధించింది. ప్రస్తుతం టీమిండియా విజయం సాధించాలంటే 133 పరుగులు చేయాల్సి ఉంది.
మొదట్లో వికెట్ల పడకుండా ఆడిన నమీబియా తర్వాత వరుస వికెట్లు కోల్పోతోంది. తాజాగా నాలుగో వికెట్ పడింది. అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ పెవిలియన్ బాట పట్టారు.
నమీబియా మరో వికెట్ కోల్పోయింది. జడేజా మాయాజలంతో రెండో వికెట్‌ను తీసుకున్నాడు. జడేజా విసిరిన బంతికి స్టీఫెన్ బైర్డ్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో వెనుతిరిగాడు. ప్రస్తుతం నమీబియా 8 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 42 పరుగుల వద్ద కొనసాగుతోంది.
నమీబియా రెండో వికెట్ కోల్పోయింది. రవింద్ర జడేజా బౌలింగ్‌లో షాట్ కొట్టడానికి ముందుకు వచ్చిన విలియమ్స్ స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి నమీబియా రెండు వికెట్ల నష్టానికి 34 పరుగుల వద్ద కొనసాగుతోంది.
దూకుడుగా ఆడుతోన్న నమీబియాకు తొలి దెబ్బతగిలింది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన లింజెన్ షమీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
టీమిండియా బ్యాట్స్‌మెన్ మంచి ఆరంభంతో మ్యాచ్‌ను ప్రారంభించారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి నమీబియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీఫెన్ (2), లింగెన్ (10) పరుగులతో ఉన్నారు.
టీమిండియా జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.
నమీబియా జట్టు:
గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), స్టీఫెన్ బైర్డ్, మైఖేల్ వాన్ లింగెన్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), డేవిడ్ వీసా, JJ స్మిత్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, క్రెయిగ్ విలియమ్స్, రూబెన్ ట్రంపెల్‌మాన్, జాన్ ఫ్రైలింక్,
బెర్నార్డ్ స్కోల్ట్జ్.
దుబాయ్ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న పిచ్ కావడంతో ముందు బౌలింగ్‌ను ఎన్నుకొని నమీబియాను తక్కువ పరుగులకే పరిమితం చేయాలనే ఉద్దేశంతో కోహ్లీ ఉన్నట్లు తెలుస్తోంది.
నమీబియాతో జరిగుతోన్న ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకర్షించే విషయాలేవీ లేకపోయినప్పటికీ.. కొన్ని విషయాలు మాత్రం తనకు ఆసక్తి కలిగించేవి ఉన్నావని వచెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్. ఈ విషయమై ఆయన కూ లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ మ్యాచ్‌లో చివరిసారి కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను చూడాలనుకుంటున్నాను. అదేవిధంగా రోహిత్, రాహుల్, బుమ్రా షమీ, అశ్విన్, జడేజా ఆటతీరుతో పాటు అన్నింటికంటే ముఖ్యంగా నా స్నేహితుడు రవిశాస్త్రికి కూడా చివరి మ్యాచ్‌తో సరైన సెండాఫ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు.
– Wasim Akram (@wasimakramlive) 8 Nov 2021
అంతర్జాతీయ టీ20 పిచ్‌లో భారత్, నమీబియా జట్లు గతంలో ఎప్పుడూ తలపడలేదు. అంటే ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. అఫ్గానిస్థాన్ ఓటమి భారత ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నమీబియా జట్టు కూడా దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో తిరగబడాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.