Watch Video: టీమిండియా నయావాల్‌కు షాకిచ్చిన భారత స్టార్ బౌలర్.. అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్.. Viral video

|

Jun 24, 2022 | 5:54 PM

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నయావాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాట పట్టాడు. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పెవిలియన్ చేర్చిన వీడియో నెట్టింట్లో ఆకట్టుకుంటోంది.

Watch Video: టీమిండియా నయావాల్‌కు షాకిచ్చిన భారత స్టార్ బౌలర్.. అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్.. Viral video
India Vs Leicestershire
Follow us on

వరుసగా విఫలమవుతుండడంతో ఈ సినీయర్ ప్లేయర్‌పై విమర్శలు మొదలయ్యాయి. దీంతో టీమిండియా నుంచి సెలక్టర్లు తప్పించారు. వీటికి సమాధానంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడి తనను తాను నిరూపించుకోవాలని చూశాడు. అనుకున్నట్లుగానే వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో సత్తా చాటాడు. దీంతో విమర్శలు గుప్పించిన వారే, పొగడ్తల వర్షం కురిపించారు. సెలక్టర్లు కూడా టీమిండియాలోకి ఆహ్వానం పలికారు. ఇదే అంచనాలతో ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కానీ, టీమిండియా స్టార్ బౌలర్‌కు వికెట్ సమర్పించుకుని, పెవిలియన్ చేరి, అంచనాలను వమ్ము చేశాడు. ఆయనెవరో కాదు.. టీమిండియాల్ నయావాల్ ఛతేశ్వర్ పుజారా గురించే మాట్లాడుతున్నాం. ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు, లీసెస్టర్‌షైర్ టీంతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా భారత ఆటగాళ్లు తమను తాము టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంది. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో ఛెతేశ్వర్‌ పుజారాతో సహా నలుగురు భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు లీసెస్టర్‌షైర్‌ తరపున ఆడుతున్నారు. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు లీసెస్టర్‌షైర్ తరుపున ఛెతేశ్వర్ పుజారా బరిలోకి దిగాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌లో కౌంటీ మ్యాచ్‌ల్లో పరుగుల వరద కురిపించిన పుజారా.. ఈ మ్యాచ్‌లోనూ అలాగే చేస్తాడని ఆశించారు. కానీ, ఖాతా తెరవకుండానే మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పుజారా వికెట్ తీసిన తర్వాత షమీ అతని భుజం ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు డిక్లెర్..

ఇవి కూడా చదవండి

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 246 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ అజేయంగా 70 పరుగులతో నిలిచాడు. దీనికి తోడు విరాట్ కోహ్లీ 33, కెప్టెన్ రోహిత్ శర్మ 25 పరుగుల సహకారం అందించారు. లీసెస్టర్‌షైర్ తరపున రోమన్ వాకర్ గరిష్టంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

కౌంటీల్లో అద్భుత ప్రదర్శన..

కౌంటీ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో ససెక్స్ తరపున పుజారా ఐదు మ్యాచ్‌ల్లో 120 సగటుతో 720 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నాలుగు సెంచరీలు సాధించింది. అందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, ఒక మ్యాచ్‌లో అతను 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

34 ఏళ్ల ఛెతేశ్వర్ పుజారా 95 టెస్టు మ్యాచ్‌ల్లో 43.87 సగటుతో 6713 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్‌లో 18 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో పుజారా అత్యుత్తమ స్కోరు 206 నాటౌట్‌గా నిలిచింది.