
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా గట్టి షాకే తగిలింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్.. పాపం పసికూన ఐర్లాండ్, బలమైన టీమిండియా యంగ్ బ్లడ్ ముందు కనీసం నిలబడుతుందా? అని చాలా మంది అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా బ్యాటింగ్‌లో గట్టి పోటీ ఇచ్చింది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే.. ఐర్లాండ్ ఒక ఫైటింగ్ టార్గెట్ అయిన ఇస్తే బాగుంటుంది.. టీమిండియా బ్యాటర్ల బ్యాటింగ్ ఎంజాయ్ చేయొచ్చని క్రికెట్ అభిమానులు అనుకున్నారు.
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తే ఐర్లాండ్ ఏకంగా 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఇందులో ఐర్లాండ్ బ్యాటర్లను ఎంత మెచ్చుకన్నా తప్పులేదు. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మరోవైపు టీమిండియా బౌలింగ్ ఎటాక్‌లో కొంతమంది బౌలర్లు రాణిస్తే.. కొంతమంది తేలిపోయారు. ఐర్లాండ్ వంటి పసికూన జట్టుపై పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలం అయ్యాడు. తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఐర్లాండ్ 9 వికెట్లు కోల్పోయినా.. ప్రసిద్ధ్‌కు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పైగా ఒకే ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఐర్లాండ్ బ్యాటర్ గారెత్ డెలానీ వరుసగా మూడు సిక్సులతో అల్లాడించాడు. మొహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్‌ను కాదని ఇతన్ని టీమ్‌లోకి తీసుకుంటే ఇలాగే ఉంటుందని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
27 RUNS IN THE SINGLE OVER 🤯
– Ireland on charge, incredible batting in the first T20I. pic.twitter.com/4lNahIj9mr
— Johns. (@CricCrazyJohns) June 26, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి