India vs England: మొతేరా స్టేడియంలో మోత మోగించే దమ్మున్న ఆటగాళ్లు ఎవరున్నారు…!

|

Feb 22, 2021 | 7:46 PM

Ind vs Eng: అహ్మదాబాద్ మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం జరుగనుంది. మొతేరా స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డుంది.

India vs England: మొతేరా స్టేడియంలో మోత మోగించే దమ్మున్న ఆటగాళ్లు ఎవరున్నారు...!
Follow us on

India vs England: అహ్మదాబాద్ మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం జరుగనుంది. మొతేరా స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డుంది. ఈ నేపథ్యంలో ఈ స్టేడియంలో భారత ఆటగాళ్ల హైలెట్స్ ఓ సారి చూద్దం.

టీమిండి-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ప్రారంభంకానుంది. మొతేరా వేదికగా ఈ డేనైట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. పింక్ బాల్‌తో టీమిండియా ఆడబోతున్న మూడో టెస్టు ఇది. అయితే మొతేరాను ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా తిరిగి నిర్మించిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం.

రికార్డు భళా..

అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఇప్పటివరకు 12 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగింటిలో గెలిచిన టీమిండియా రెండింటిలో ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మరొకటి డ్రాగా ముగించింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరుతో

అయితే తాజాగా టీమిడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరుతో కూడా రికార్డులు ఉన్నాయి. ధోనీ సరథ్యంలో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో కోహ్లీ మొత్తం 33 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 19, రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌ 14 పరుగులు చేశాడు.

ఇకపుజారా (ఇంగ్లాండ్​పై 206 పరుగులు-2012)

2012లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు నయా వాల్ పుజారా. మొదట బ్యాటింగ్​ చేసిన భారత్‌కు సెహ్వాగ్ సెంచరీతో జోరు చూపించగా, పుజారా తన మారథాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దాదాపు 513 నిమిషాల పాటు క్రీజులో ఉన్న పుజారా.. 21 ఫోర్స్ సాయంతో 389 బంతుల్లో 206 పరుగులు సాధించాడు. ఇతడికి టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

స్పిన్ బౌలర్ అశ్విన్ రికార్డు

2012 లో మొతేరా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ కూడా మంచి రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రికార్డు ఉంది. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇక్క మరో చరిత్ర ఉంది. టెస్ట్ ఇన్నింగ్ ఇండియా vs ఇంగ్లాండ్ చెన్నై టెస్ట్ యొక్క మొదటి బంతికి వికెట్ తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ.. 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రెండో భారత ఫాస్ట్ బౌలర్‌గా ఇషాంత్ శర్మ ఈ స్టేడియంలో చరిత్ర ఉంది.

అంతా కొత్తవారే…

ఇక మొతేరా స్టేడియంలో ఆడి అనుభవం ఇప్పుడున్న జట్టు ఈ నలుగురు ఆటగాళ్లకే ఉంది. జట్టు ఆటగాళ్ళు ఎవరూ ఇప్పటివరకు స్టేడియంలో ఆడలేదు. జట్టు అనుభవజ్ఞులు అజింక్య రహానె, రోహిత్ శర్మ నుండి శుబ్మాన్ గిల్ మహ్మద్ సిరాజ్ వరకు యువకులు ఈ స్టేడియంలో తొలిసారి ఆడనున్నారు.

మొతేరాలో అద్భుత ఇన్నింగ్స్‌

వీరేంద్ర సెహ్వాగ్ ( ఇంగ్లాండ్​పై 117 పరుగులు-2012)

టెస్టుల్లో పరుగులు రాబట్టే తీరునే మార్చేశాడు టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇంగ్లాండ్​పై 2012లో మొతేరా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు వీరు. తర్వాత ఇతడు మరి కొన్ని టెస్టులు ఆడినా.. తన కెరీర్​లో ఇదే చివరి టెస్టు సెంచరీ కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి

Passport Scam: ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. షాకింగ్ విషయమేంటంటే?