
ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. వన్డే సిరీస్ ఆడేందుకు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ల్యాండ్ అయిపోయి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా ఐదు టీ20ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టె్న్సీలోని యంగ్ టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఏకంగా 0-4 తేడాతో సిరీస్ కోల్పోయింది. అయితే ఈ ఓటమికి ఇంగ్లాండ్‌పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రివేంజ్ తీర్చుకుంటారని భారత క్రికెట్ అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు.
ఈ క్రమంలోనే టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో విరాట్ కోహ్లీ వేలు చూపిస్తూ సీరియస్‌గా మాట్లాడుతున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ, గిల్‌తో వేలు చూపిస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు, గిల్, కోహ్లీకి ఏదైన విషయంలో కోపం తెప్పించాడా? లేక సరదాగా అలా మాట్లాడుతున్నాడా అర్థం కాక క్రికెట్ అభిమానులు టెన్షన్ అవుతున్నారు. అయితే నిజానికి అక్కడ అంత సీరియస్ ఏం లేదు. రాబోయే సిరీస్ గురించి సీనియర్ ప్లేయర్‌గా, మాజీ కెప్టెన్‌గా, ఇంగ్లాండ్ ఆడిన అనుభవం ఉన్న సీనియర్ ప్రోగా విరాట్ కోహ్లీ, యంగ్ కెప్టెన్ గిల్‌కు విలువైన సూచనలు ఇచ్చాడని సమాచారం.
పైగా శుబ్‌మల్ గిల్, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి గిల్ ఇన్స్పిరేషన్ కూడా విరాట్ కోహ్లీనే. తన ఐడిల్ కోహ్లీని గిల్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అలాగే గిల్‌ను కోహ్లీ తమ్ముడిలా భావిస్తాడు. అప్పుడప్పుడు అతన్ని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాడు కూడా. ఇక ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్ విషయానికి వస్తే.. 1వ వన్డే ఈ నెల 14న (మంగళవారం) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. 2వ వన్డే 16న (గురువారం) కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా సాయంత్రం 5:30 గంటలకు, అలాగే 3వ వన్డే 19న (ఆదివారం) లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి