India vs England 4th T20 Match Highlights : దెబ్బకు దెబ్బ తీసిన భారత్‌.. నాలుగో టీ20లో భారత్‌ విజయం.. సిరీస్‌పై ఆశలు సజీవం..

| Edited By: Team Veegam

Mar 19, 2021 | 12:48 AM

India vs England 4th T20 Live Updates : భారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ 20 మ్యాచ్‌ టాస్‌ మళ్లీ ఇంగ్లాండ్ జట్టు సారథి మోర్గానే గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు‌ కోసం తొలి టీ20కి

India vs England 4th T20 Match Highlights : దెబ్బకు దెబ్బ తీసిన భారత్‌.. నాలుగో టీ20లో భారత్‌ విజయం.. సిరీస్‌పై ఆశలు సజీవం..
T20

India vs England 4th T20 Live Updates: భారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ 20 మ్యాచ్‌ టాస్‌ మళ్లీ ఇంగ్లాండ్ జట్టు సారథి మోర్గానే గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు‌ కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు. అప్పటితో పోలిస్తే పచ్చికను పూర్తిగా తొలగించారు. వికెట్‌ చాలా గట్టిగా ఉంది. ఆంగ్లేయులు మళ్లీ అదనపు పేస్‌, బౌన్స్‌తో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోరులో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్‌ చేజార్చుకుంటుంది. రాహుల్‌ చాహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.

భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి అరంగ్రేటం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సూర్యకుమార్ 31 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 37 పరుగులు చేసి వేగంగా ఆడాడు. రిషబ్ పంత్ 23 బంతుల్లో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగిలిన వారిలో ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను భారత బౌలర్ భువనేశ్వర్ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. ఏకంగా మొదటి ఓవర్‌నే మెయిడిన్ చేశాడు. ఇక భువనేశ్వర్ వేసిన 2.5 బంతికి జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ , కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్

ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మాలన్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, సామ్ కరన్, మార్క్ వుడ్, జోర్డాన్, ఆర్చర్, రషీద్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2021 11:15 PM (IST)

    టీమిండియా విజయం.. సిరీస్‌పై ఆశలు సజీవం..

    ఐదు టీ20 సిరీస్‌లో కీలకంగా మారిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమానమైంది.

  • 18 Mar 2021 11:12 PM (IST)

    టెన్షన్‌.. టెన్షన్‌… 2 బంతులు 9 పరుగులు..

    నాలుగో టీ20 మ్యాచ్ చివరికి చేరుకునే సమయానికి రసవత్తరంగా మారింది. చివరిలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆర్చర్‌, జోర్దన్‌ జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 2 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో మ్యాచ్‌ టెన్షన్‌ టెన్షన్‌గా మారింది.

  • 18 Mar 2021 11:01 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌… భారత్‌ విజయం దాదాపు ఖాయం..

    భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. హార్ధిక్‌ పాండ్యే బౌలింగ్‌లో సామ్‌ కరన్‌ బోల్డ్‌ అయ్యాడు. ఇంగ్లాండ్‌ విజయానికి 10 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉండడంతో భారత్‌ విజయం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.

  • 18 Mar 2021 10:55 PM (IST)

    మ్యాచ్‌పై పట్టు సాధిస్తోన్న భారత్‌..

    ఐదు టీ20ల సిరీస్‌లో కొనసాగాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ పట్టుసాధిస్తోంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండడంతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలో పడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 17 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో జోర్దన్‌ (6), సామ్ కరన్ (3) కొనసాగుతున్నారు.

  • 18 Mar 2021 10:51 PM (IST)

    ఒత్తిడిలో ఇంగ్లాండ్‌… వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లిష్‌ జట్టు.

    భారత్‌ను విజయతీరాలకు చేర్చే క్రమంలో భారత బౌలర్లు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు తీశాడు శార్దుల్‌ పటేల్‌. శార్దుల్‌ వేసి 16.1 బంతికి బెన్‌ స్టోక్స్‌ అవుట్‌ కాగా.. ఆ తర్వాత వేసిన బంతికే (16.2) మోర్గాన్‌ క్యాచ్‌ రూపంలో వెనుదిరిగాడు. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్‌పై పట్టు సాధిస్తోంది. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 19 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Mar 2021 10:40 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌… పెవిలియన్‌ బాట పట్టిన బరిస్టో..

    గెలుగు తప్పనిసరిగా మారిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. నిలకడగా జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తోన్న బరిస్టోను రాహుల్‌ చాహర్‌ పెవిలియన్‌ బాట పట్టించాడు. రాహుల్‌ వేసిన బంతికి షార్ట్‌ ఆడడానికి ప్రయత్నించిన బరిస్టో వాషింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే 28 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Mar 2021 10:12 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. జేసన్ రాయ్ ఔట్

    ఇంగ్లాండ్ జట్టు కీలకమైన మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న జేసన్ రాయ్ ను హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు. సూర్యకుమార్ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. 9 ఓవర్లకు ఇంగ్లాండ్ 66/3 పరుగులతో కొనసాగుతోంది.

  • 18 Mar 2021 09:59 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. మలన్ ఔట్

    ఇంగ్లాండ్ జట్టు కీలకమైన రెండో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మలన్ 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

  • 18 Mar 2021 09:55 PM (IST)

    50 పరుగులు దాటిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి 56/1 తో ఆట కొనసాగిస్తోంది. శార్దల్ ఠాకుర్ వేసిన ఈ ఓవర్లో డేవిడ్ మలన్ సిక్స్ బాదాడు. మొత్తం ఈ ఓవర్లో 8 పరుగులు రాబట్టారు. కాగా జేసన్ రాయ్ అర్ధ సెంచరీ దిశగా వెళుతున్నాడు. డేవిడ్ మలన్ 13 పరుగులతో కొనసాగుతున్నాడు.

  • 18 Mar 2021 09:52 PM (IST)

    ఆరో ఓవర్లో 17 పరుగులు..

    వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 17 పరుగులు రాబట్టారు. ఒక సిక్సర్‌, రెండు ఫోర్లు బాదారు. జేసన్ రాయ్ 33 చాలా వేగంగా ఆడుతున్నాడు. అతడికి తోడుగా డేవిడ్ మలన్ 5 పరుగులతో ఉన్నాడు. కాగా ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 48/1 వికెట్ తో ఆట కొనసాగిస్తోంది.

  • 18 Mar 2021 09:45 PM (IST)

    5 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 31/1

    5 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు 31/1పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో జేసన్ రాయ్ 17 పరుగులు, డేవిడ్ మలన్ 4 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. కాగా హర్దిక వేసిన ఐదో ఓవర్లో మలన్ ఇచ్చిన క్యాచ్‌ను శార్దులో జారవిడిచాడు.

  • 18 Mar 2021 09:37 PM (IST)

    బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. మొదటి ఓవర్ మెయిడిన్.. బట్లర్ ఔట్

    బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను భారత బౌలర్ భువనేశ్వర్ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. ఏకంగా మొదటి ఓవర్‌నే మెయిడిన్ చేశాడు. ఇక భువనేశ్వర్ వేసిన 2.5 బంతికి జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. జేసన్ రాయ్, డేవిడ్ మలన్ ఆడుతున్నారు.

  • 18 Mar 2021 09:07 PM (IST)

    భారత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు..

    భారత్- ఇంగ్లాండ్ నాలుగో టీ ట్వంటీ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి ఓవర్లో ఆర్చర్ 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

  • 18 Mar 2021 08:58 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయాస్ ఔట్

    భారత్ ఏడోవికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 18 బంతుల్లో 37 ఔట్ అయ్యాడు. భారీ షాట్ ఆడుతూ.. మలన్‌కి క్యాచ్ ఇచ్చాడు.

  • 18 Mar 2021 08:53 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. హార్దిక్‌ ఔట్

    భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మార్క్‌వుడ్ వేసిన 18.5 బంతికి హార్ధిక్‌ పాండ్య 11 పరుగులు ఔట్ అయ్యాడు.

  • 18 Mar 2021 08:49 PM (IST)

    సిక్సర్‌తో చెలరేగిన శ్రేయస్

    శ్రేయస్ అయ్యర్ వేగంగా ఆడుతున్నాడు. 18 ఓవర్లో 18 పరుగులు సాధించారు. ఓ సిక్సర్, ఓ బౌండరీ బాదాడు. హార్దిక్ కూడా 9 పరుగులతో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు భారత్ 167/5 పరుగులతో కొనసాగుతోంది.

  • 18 Mar 2021 08:47 PM (IST)

    17 ఓవర్లకు భారత్ 149/5..

    రిషభ్ పంత్ ఔట్ అవ్వడంతో హార్దిక్ క్రీజులోకి వచ్చాడు. కాగా శ్రేయస్ అయ్యర్ దూకుడు పెంచాడు. అంతకు ముందు బ్రిటీష్ బౌలర్ 9 పరుగులిచ్చి పంత్ ను ఔట్ చేశాడు. ఇప్పటి వరకు అయ్యర్ 25 పరుగులు, హార్దిక్ 2 పరుగులతో కొనసాగుతున్నారు.

  • 18 Mar 2021 08:40 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. రిషభ్ పంత్ ఔట్

    భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించిన పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 23 బంతుల్లో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు.

  • 18 Mar 2021 08:37 PM (IST)

    ఫాస్ట్‌గా ఆడుతున్న శ్రేయాస్..

    ఆట చివరికి రావడంతో టీమిండియా ఆటగాళ్లు వేగం పెంచారు. 16 ఓవర్లో శ్రేయాస్ కళ్లు చెదిరే రెండు బౌండరీలు సాధించాడు. పంతో 26 పరుగులతో కొనసాగుతున్నాడు. కాగా ఈ ఓవర్లో 12 పరుగులు సాధించారు. దీంతో భారత్ 140/4 వికెట్లతో ఆడుతుంది.

  • 18 Mar 2021 08:29 PM (IST)

    15 ఓవర్లకు భారత్..128/4.. ఇంకా 30 బంతులే..

    సూర్యకుమార్ ఔట్ కావడంతో క్రీజులోకి శ్రేయస్ వచ్చాడు. వచ్చి రాగానే రెండు బౌండరీలు సాధించాడు. పంత్ 25 పరుగులతో కొనసాగుతున్నాడు. కాగా భారత్ 15 ఓవర్లు ముగిసేసరికి 128/4 పరుగులతో కొనసాగుతోంది.

  • 18 Mar 2021 08:24 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్యకుమార్ ఔట్

    భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ 13 ఓవర్లో సామ్ కరన్ వేసిన బంతిని గాల్లోకి లేపాడు. దీంతో మలన్ క్యాచ్ పట్టాడు. కొంచెం అనుమానం ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో 31 బంతుల్లో 57 పరుగులకు తెరదించాడు.

  • 18 Mar 2021 08:19 PM (IST)

    టీ ట్వంటీల్లో అరంగేట్రం అర్ధశతక వీరులు వీరే..

    1.అజింక్యా రహానె -2011 ఇంగ్లాండ్, మాంచెస్టర్‌పై
    2.ఇషాన్ కిషన్- 2021, ఇంగ్లాండ్, అహ్మదాబాద్
    3. రోహిత్ శర్మ-2007, దక్షిణాఫ్రికా, డర్బన్
    4. రాబిన్ ఊతప్ప-2007, పాకిస్తాన్ – డర్బన్
    5. సూర్యకుమార్-2021, ఇంగ్లాండ్, అహ్మదాబాద్

     

  • 18 Mar 2021 08:07 PM (IST)

    సూర్య కుమార్ హాఫ్ సెంచరీ..

    సూర్యకుమార్ 28 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. పంత్ అతడికి 7 పరుగులతో తోడుగా ఉన్నాడు. 12 ఓవర్లకు భారత్ 92/3 వికెట్లతో కొనసాగుతోంది. కాగా సూర్యకుమార్ మొదటి సారిగా హాఫ్ సెంచరీ చేయడం విశేషం

  • 18 Mar 2021 08:05 PM (IST)

    ఇంగ్లాండ్ బౌలర్లు..వేగంగా విసురుతున్న బంతులు

    ఇంగ్లాండ్ బౌలర్లు మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంట వెంటనే కోహ్లీ, రాహుల్‌ని ఔట్ చేసి మంచి ఊపుమీదున్నారు. భారత బ్యాట్స్‌మెన్ వేగం తగ్గింది. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. భారత్ 11 ఓవర్లకు 79/3 తో కొనసాగుతోంది.

  • 18 Mar 2021 07:59 PM (IST)

    రోహిత్ శర్మ అరుదైన రికార్డు

    రోహిత్ శర్మ తొందరగా ఔటైనప్పటికి ఒక రికార్డు అతడి ఖాతాలో చేరిపోయింది. అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ కొట్టిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతేకాకుండా భారత గడ్డపై 50 టీ ట్వంటీ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

  • 18 Mar 2021 07:57 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీ స్టంప్ ఔట్..

    భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కోహ్లీ స్టంప్ ఔటయ్యాడు. దీంతో పంత్ క్రీజులోకి వచ్చాడు. దీంతో భారత్ 10 ఓవర్లకు 75/3 వికెట్లతో కొనసాగుతోంది. పంత్ 3, సూర్య 37 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.

  • 18 Mar 2021 07:53 PM (IST)

    క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ..

    కే. ఎల్. రాహుల్ ఔటవ్వడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఇప్పటి వరకు భారత్ 8 ఓవర్లకు 68/2 పరుగులతో కొనసాగుతుంది. కాగా సూర్యకుమార్ తనదైన శైలిలో ఆడుతున్నాడు. ఓవర్ చివరి బంతికి బౌండరీ బాదాడు. 35 పరుగులతో జోరుగా ఆడుతున్నాడు.

  • 18 Mar 2021 07:43 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది.. కే. ఎల్. రాహుల్ 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. స్టోక్స్ వేసిన 7.4 బంతికి అర్చర్‌కి సులభంగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ తీవ్ర నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు.

  • 18 Mar 2021 07:31 PM (IST)

    5 ఓవర్లకు భారత్ 34/1

    క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ చాలా వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కవర్స్ మీదుగా మరో బౌండరీ సాధించాడు. బ్రీటీష్ బౌలర్ మార్క్‌వుడ్ చాలా వేగంగా బంతులు విసురుతున్నాడు. రాహుల్ 7 పరుగులతో ఆట కొనసాగిస్తున్నాడు.

  • 18 Mar 2021 07:27 PM (IST)

    భారత్ 4 ఓవర్లకు 27/1 పరుగులు.

    క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ సిక్సర్ తో ఖాతా ప్రారంభించాడు. ఫైన్‌ లెగ్ లో భారీ సిక్సర్ బాదేశాడు. రాహుల్ 7 పరుగులతో ఆడుతున్నాడు. ఇప్పటికి భారత్ 4 ఓవర్లకు 27/1 పరుగులు.

  • 18 Mar 2021 07:24 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా తన తొలి వికెట్‌ను కోల్పోయింది. జోప్రా ఆర్చర్ వేసని మూడో ఓవర్లో రోహిత్ శర్మ ఔటయ్యాడు. స్లో బంతిని ఆడటంలో విఫలమైన రోహిత్ ఆర్చర్ కి దొరికిపోయాడు. దీంతో 12 పరుగులకే వెనుదిరిగాడు..

  • 18 Mar 2021 07:20 PM (IST)

    రెండు ఓవర్లకు భారత్ 18/0

    బ్రిటీష్‌ బౌలర్ ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడు. ఈ ఓవర్లో మొదటి ఐదు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి బంతిని రాహుల్ ఫోర్‌గా మలిచాడు. రోహిత్ 11 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.

  • 18 Mar 2021 07:14 PM (IST)

    సిక్సర్‌తో ఖాతా ప్రారంభించిన రోహిత్..

    తొలి ఓవర్‌తో భారత్ శుభారంభం చేసింది. రోహిత్ శర్మ సిక్సర్‌తో ఖాతా ప్రారంభించాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ 12/0 పరుగులతో కొనసాగుతోంది. ఇంగ్లాడ్ బౌలర్ ఫస్ట్ ఓవర్‌లోనే 12 పరుగులు సమర్పించుకున్నాడు

Follow us on