India vs England 3rd Test Live: మోదీ స్టేడియంలో కోహ్లీ సేన మోత.. మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం..

|

Feb 25, 2021 | 8:46 PM

India vs England live: పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 49 పరుగులు టార్గెట్‌తో రంగంలోకి దిగిన భారత ఆటగాళ్లు 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విజయానికి 10 పరుగులు..

India vs England 3rd Test Live: మోదీ స్టేడియంలో కోహ్లీ సేన మోత.. మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం..

IND vs ENG: పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 49 పరుగులు టార్గెట్‌తో రంగంలోకి దిగిన భారత ఆటగాళ్లు 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫోర్‌, సిక్స్‌ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

పింక్ బాల్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. 30.4 ఓవర్లకు ఆ జట్టు 81 పరుగులకే ఆలౌటైంది. 30.4వ బంతికి అండర్సన్‌ (0)ను ఔట్‌ చేసి ఇన్నింగ్స్‌ ముగించేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 5, అశ్విన్‌ 4 వికెట్లు తీశారు. భారత్‌ మరో 49 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.

అక్షర్ తన బౌలింగ్ పవర్ చూపించాడు. రెండో రోజు తొలి ఓవర్‌లో  రెండు వికెట్లు తీసిన అక్షర్ 8.3 ఓవర్‌లో మూడో వికెట్ తీశాడు. సిబ్లీ(7) కీపర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. అయితే ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ జాక్‌ క్రాలే(0) బౌల్డవ్వగా, రెండో బంతికి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే, అతడు రివ్యూకు వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది. ఇక తర్వాతి బంతికే బెయిర్‌స్టో మళ్లీ బౌల్డవ్వడంతో ఇంగ్లాండ్ పరుగుల ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో సిబ్లీ, రూట్‌ ఉన్నారు.

రెండవ రోజు…

అంతకు ముందు పింక్‌ బాల్‌ టెస్టులో రూట్ దెబ్బకు టీమిండియా ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఇంటి దారి పట్టారు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తడబడిన పిచ్‌పై ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలిచేందుకు తంటాలు పడ్డారు. ఇంగ్లాండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌, కెప్టెన్‌ జో రూట్‌ స్పిన్‌ దెబ్బకు టీమిండియా వికెట్లు వరసగా పడేశారు. ఈ జోడీ పోటీపడి వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది.

ముందు రోజు..

ముందు రోజు.. పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట ప్రారంభించింది. 99/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో గురువారం రోహిత్‌(57), రహానె(1) బ్యాటింగ్‌ ఆరంభించారు. అంతకు ముందు టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(27).. లీచ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. శుబ్‌మన్‌ గిల్‌(11), చతేశ్వర్‌ పుజారా(0)ల వికెట్లను వరుస ఓవర్లలో చేజార్చుకుంది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 15 ఓవర్‌ చివరి బంతికి గిల్‌ ఔట్‌ కాగా, ఆపై వచ్చిన పుజారా సైతం నిరాశపరిచాడు.

Key Events

టీమిండియా ఘన విజయం

పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 49 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

అక్షర్ – అశ్విన్ అద్భుతం

పింక్ బాల్ టెస్ట్‌లో రెండో రోజు లోకల్ బాయ్ అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు పడగొట్టారు. అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 25 Feb 2021 08:36 PM (IST)

    విజయం తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌పై విరాట్ కామెంట్..

    పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ విజయం ఉన్నప్పటికీ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పట్ల సంతోషంగా కనిపించలేదు. మ్యాచ్ తరువాత, అతను బ్యాటింగ్ వివరాలను వివరించాడు. నిజాయితీగా చెప్పాలంటే బ్యాటింగ్ బాగా లేదని విరాట్ అన్నాడు. మేము బాగా బ్యాటింగ్ చేశామని నేను అనుకోను. ఇరు జట్లు ఇలానే ఆడాయి. ఇరు జట్లు బ్యాటింగ్‌కు దూరమయ్యాయి.

  • 25 Feb 2021 08:34 PM (IST)

    మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

    పింక్ బాల్ టెస్టులో 11 వికెట్లు తీసిన లోకల్ బాయ్ అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ కెరీర్‌లో వరుసగా 3 ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు తీశాడు. అహ్మదాబాద్ రెండు ఇన్నింగ్స్‌లతోపాటు చెన్నై రెండో ఇన్నింగ్‌లో అక్షర్ ఈ అద్భుతం చేశాడు.

  • 25 Feb 2021 08:32 PM (IST)

    భారత బౌలర్లపై జో రూట్ ప్రశంసలు

    భారత బౌలింగ్‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రశంసించాడు. భారత బౌలింగ్ షో టాప్ క్లాస్ అని అన్నారు.  భారత బౌలింగ్ ముందు, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 112 పరుగులు మరియు రెండవ ఇన్నింగ్స్లో 81 పరుగులు చేసింది.

  • 25 Feb 2021 08:29 PM (IST)

    400 వికెట్లు సాధించడంపై అశ్విన్ ఏమన్నాడంటే…

    ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో అశ్విన్ ప్రత్యేక రికార్డు సాధించాడు. ఈ రికార్డు టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్లు. ఇది సాధించిన గొప్ప అనుభూతి అని అశ్విన్ చెప్పాడు. స్టేడియం మొత్తం మీ కోసం చప్పట్లు కొడుతుండటం ఆనందంగా ఉంది. మరియు ముఖ్యంగా, ఈ విజయం జట్టు విజయానికి వచ్చింది.

  • 25 Feb 2021 08:01 PM (IST)

    మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం..

    మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం అందుకుంది. ఆ జట్టు నిర్దేశించిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది.

  • 25 Feb 2021 07:42 PM (IST)

    రోహిత్ బౌండరీ

    టీమిండియా ఆటగాళ్లు బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. గిల్ దూకుడుకు రోహిత్ కూడా తోడాయ్యాడు.

  • 25 Feb 2021 07:41 PM (IST)

    గిల్ సిక్సర్

    గిల్ దుమ్ము రేపుతున్నాడు. బౌండరీలతోపాటు సిక్సర్ బాదాడు.

  • 25 Feb 2021 07:40 PM (IST)

    మరో బౌండరీతో దూకుడు మీదున్న గిల్

    మరి కాసేపట్లో టెస్ట్ మ్యాచ్‌లో గిల్ దూకుడు మీదున్నాడు. బౌండరీలతో అదరగొడుతున్నాడు.

  • 25 Feb 2021 07:35 PM (IST)

    బ్రేక్ తర్వాత గిల్ బౌండరీ

    డిన్నర్ బ్రేక్ తర్వాత మొదలైన ఆటలో గిల్ బౌండరీతో శుభారంభం చేశాడు.

  • 25 Feb 2021 07:29 PM (IST)

    రెండో రోజు డిన్నర్‌ బ్రేక్..

    రెండో రోజు డిన్నర్‌ బ్రేక్‌ కొనసాగుతోంది. ఈ సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (1), రోహిత్‌ శర్మ (6) క్రీజులో ఉన్నారు. భారత్‌ విజయానికి మరో 38 పరుగులు చేస్తే చాలు.

  • 25 Feb 2021 07:15 PM (IST)

    దూకుడు మొదలు పెట్టిన కోహ్లీ సేన

    గులాబి టెస్టులో టీమిండియా దూకుడు మొదలు పెట్టింది. 49 పరుగుల టార్గెట్‌ను ఈజీ బ్రేక్ చేసేలా కనిపిస్తోంది

  • 25 Feb 2021 06:51 PM (IST)

    81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్

    పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది.

  • 25 Feb 2021 06:43 PM (IST)

    రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది.. టీమిండియా 49 పరుగుల లీడ్

    పింక్ బాల్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. 30.4 ఓవర్లకు ఆ జట్టు 81 పరుగులకే ఆలౌటైంది. 30.4వ బంతికి అండర్సన్‌ (0)ను ఔట్‌ చేసి ఇన్నింగ్స్‌ ముగించేశాడు.

  • 25 Feb 2021 06:05 PM (IST)

    మరో వికెట్ తీసిన అశ్విన్

    ఇంగ్లాండ్‌ మరో కీలక వికెట్‌ చేజార్చుకుంది. ఇంగ్లండ్‌ జట్టును అశ్విన్‌ తన రెండు వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌ తొలి బంతికే ఆర్చర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 68 పరుగుల వద్ద ఏడో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కేవలం 35 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.అంతకముందు‌ అశ్విన్‌ బౌలింగ్‌లోనే 21వ ఓవర్‌ చివరి బంతికి ఓలీ పోప్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఆరో వికెట్‌ నష్టపోయింది.

  • 25 Feb 2021 06:02 PM (IST)

    ఆరో వికెట్ తీసిన అశ్విన్..

    అశ్విన్ ఖాతాలో మరో వికెట్ వచ్చి చేరింది. ఒలీ పోప్‌ (12/ 15 బంతుల్లో 2×4) ఔట్‌ అయ్యాడు. అశ్విన్‌ వేసిన 21.6వ బంతికి అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

  • 25 Feb 2021 05:48 PM (IST)

    అక్షర్ పటేల్ ఖాతాలో మరో వికెట్.. రూట్ ఔట్

    లోకల్ బాయ్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్ కెప్టెన్ రూట్ వికెట్‌ను అక్షర్ పటేల్ పడగొట్టాడు

  • 25 Feb 2021 05:40 PM (IST)

    అశ్విన్ బౌలింగ్‌లో స్టోక్స్ lbw

    అశ్విన్ శ్రమ ఫలించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్న అశ్విన్ స్టోక్స్ వికెట్ తీశాడు. కీలకమైన బెన్‌స్టోక్స్‌‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ ఔట్‌ చేశాడు. 17.2వ బంతికి అతడిని ఎల్బీ చేశాడు. టెస్టుల్లో స్టోక్స్‌ను యాష్ ఔట్‌ చేయడం ఇది 11వ సారి కావడం గమనార్హం.

  • 25 Feb 2021 05:29 PM (IST)

    రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌

    పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ మూడో బంతిని ఫ్లిక్‌ చేయగా రిషబ్‌ పంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 19 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది.

  • 25 Feb 2021 05:11 PM (IST)

    ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌పటేల్‌కు‌ మూడో వికెట్

    అక్షర్‌ పటేల్ ఖాతాలో మరో వికెట్ పడింది. రెండో రోజు తొలి ఓవర్‌లో  రెండు వికెట్లు తీసిన అక్షర్ 8.3 ఓవర్‌లో మూడో వికెట్ తీశాడు. సిబ్లీ(7) కీపర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ జోరూట్‌(12)కు తోడుగా బెన్‌స్టోక్స్‌ క్రీజులోకి వచ్చాడు.

  • 25 Feb 2021 05:01 PM (IST)

    రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి..

    ఇంగ్లాండ్‌ను ఆదిలోనే దెబ్బ కొట్టాడు అక్షర్ పటేల్. రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 13/2తో నిలిచింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే రూట్‌(7), సిబ్లీ(6) జాగ్రత్తగా ఆడుతున్నారు.

  • 25 Feb 2021 04:45 PM (IST)

    ఇంగ్లాండ్‌కు మరో దెబ్బ

    అక్షర్ తన బౌలింగ్ పవర్ చూపించాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ జాక్‌ క్రాలే(0) బౌల్డవ్వగా, రెండో బంతికి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే, అతడు రివ్యూకు వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది. ఇక తర్వాతి బంతికే బెయిర్‌స్టో మళ్లీ బౌల్డవ్వడంతో ఇంగ్లాండ్ పరుగుల ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో సిబ్లీ, రూట్‌ ఉన్నారు.

  • 25 Feb 2021 04:42 PM (IST)

    తొలి బంతిని ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టిన అక్షర్

    అక్షర్ పటేల్ వేసిన మొదటి ఓవర్ ఇంగ్లాండ్‌  ఆటగాళ్లకు చుక్కలు కనిపించాయి. తొలి బంతికే తొలి వికెట్ తీశాడు.  జాక్ క్రౌలీని ఇంటి దారి చూపించాడు.

  • 25 Feb 2021 04:16 PM (IST)

    టీమిండియా రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్

    పింక్‌ బాల్‌ టెస్టులో రూట్ దెబ్బకు టీమిండియా ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఇంటి దారి పట్టారు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తడబడిన పిచ్‌పై ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలిచేందుకు తంటాలు పడ్డారు. ఇంగ్లాండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌, కెప్టెన్‌ జో రూట్‌ స్పిన్‌ దెబ్బకు టీమిండియా వికెట్లు వరసగా పడేశారు. ఈ జోడీ పోటీపడి వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. టీమ్‌ఇండియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది.

  • 25 Feb 2021 03:56 PM (IST)

    ఇశాంత్ శర్మ సూపర్ సిక్స్

    జాక్ లీచ్ వేసిన బంతిని సిక్సర్‌గా మార్చాడు ఇశాంత్ శర్మ. మిడ్-ఆఫ్ మీదు నుంచి దంచి కొట్టాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకుల్లో కొంత జోష్ వచ్చింది. అప్పటి వరకు వరస వికెట్లు పడుతుండటంతో నిరాశగా ఉన్న టీమిండియా అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది.

  • 25 Feb 2021 03:54 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది టీమిండియా. ధాటిగా  ఆడుతున్న అశ్విన్‌(17) రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. దీంతో భారత్‌ 134 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఇషాంత్‌, బుమ్రా ఉన్నారు. 50 ఓవర్లకు జట్టు స్కోర్‌ 134/9గా నమోదైంది.

  • 25 Feb 2021 03:51 PM (IST)

    రూట్‌ బౌలింగ్‌లో అశ్విన్ ఔట్

    టీమ్‌ఇండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న అశ్విన్‌(17) రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. దీంతో భారత్‌ 134 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది.

  • 25 Feb 2021 03:35 PM (IST)

    అక్షర్‌ పటేల్ ఔట్

    టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌(0), అక్షర్‌ పటేల్(0) ఒకే ఓవర్‌లో ఇంటిదారి పట్టారు. రూట్‌ వేసిన 45వ ఓవర్‌ తొలి బంతికి సుందర్‌ బౌల్డ్‌ కాగా, మూడో బంతికి భారీ షాట్‌ ఆడబోయి అక్షర్‌ షార్ట్‌‌ మిడ్‌ వికెట్‌లో సిబ్లీ చేతికి చిక్కాడు.

  • 25 Feb 2021 03:29 PM (IST)

    వాషింగ్టన్ సుందర్ బౌల్డ్

    వాషింగ్టన్ సుందర్ క్లీన్ బోల్డ్ అయ్యాడు.

  • 25 Feb 2021 03:12 PM (IST)

    రోహిత్‌ శర్మ ఔటైన కాసేపటికే పంత్ సైతం పెవిలియన్‌ బాట పట్టాడు

    టీమిండియా రెండో రోజు వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఆట ప్రారంభమైన 40 నిమిషాల్లోనే మూడు వికెట్లు నష్టోపోయింది. అజింక్య రహానె(7), రోహిత్‌ శర్మ(11) ఔటైన కాసేపటికే పంత్‌(1) సైతం పెవిలియన్‌ బాట పట్టాడు.  రూట్‌ వేసిన 42వ ఓవర్‌ తొలి బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీమ్‌ఇండియా 42 ఓవర్లకు 117/6తో బ్యాటింగ్‌ చేస్తోంది. క్రీజులో అశ్విన్‌(2), వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు.

  • 25 Feb 2021 03:09 PM (IST)

    రోహిత్‌ శర్మ ఔట్

    రెండో రోజు టీమ్‌ఇండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. రహానె(7)ను ఔట్‌ చేసిన లీచ్‌.. రోహిత్‌ శర్మ(66)ను కూడా ఔట్ చేశాడు. దీంతో భారత్‌ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది.

  • 25 Feb 2021 02:56 PM (IST)

    రహానె ఎల్బీడబ్ల్యూ

    పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే నాలుగో వికెట్‌ పడిపోయింది. లీచ్‌ వేసిన 38.2 ఓవర్‌కు అజింక్య రహానె(7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

  • 25 Feb 2021 02:42 PM (IST)

    తొలి రోజు 35 ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు స్కోర్‌ 100 పరుగులు

    తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్‌ 100 పరుగులు దాటింది. రోహిత్‌(58), రహానె(1) బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 35 ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు స్కోర్‌ 100/3గా నమోదైంది.

Follow us on