IND vs ENG: సిరీస్ డిసైడర్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20  ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jan 27, 2025 | 10:59 AM

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.

IND vs ENG: సిరీస్ డిసైడర్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20  ఎప్పుడు, ఎక్కడంటే?
India Vs England
Follow us on

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ మంగళవారం (జనవరి 28) జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్‌షా మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌ సిరీస్‌ నిర్ణయాత్మకం. ఎందుకంటే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. తద్వారా భారత జట్టు మూడో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌ సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించాలి. తద్వారా రాజ్‌కోట్‌ మైదానంలో ఇరు జట్ల నుంచి హోరా హోరీ పోటీ ఆశించవచ్చు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా గ్రౌండ్‌లో జరిగే 3వ టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు ముందు సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయనున్నారు.
ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. అలాగే, డిస్నీ హాట్ స్టార్ యాప్ అండ్ వెబ్‌సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన సూర్య ఇప్పుడు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ గత 12 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2022లో 1164 పరుగులు చేసిన సూర్య 2023లో 17 ఇన్నింగ్స్‌ల్లో 773 పరుగులు చేశాడు. 12 ఇన్నింగ్స్‌లు ఆడి కూడా సూర్య 250 పరుగులు చేయకపోవడం ఆశ్చర్యకరం.

రాజ్ కోట్ లో అక్షర్ పటేల్..

భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, శివమ్ దూబే.

ఇంగ్లండ్ టీ20 జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్‌టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ , ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..