IND vs ENG 2nd Test: బ్యాడ్ లైట్ కారణంగా నాలుగవ రోజు ఆట ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా 181 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రిషబ్ పంత్(14*), ఇషాంత్ శర్మ(4*) ఉన్నారు. కాగా, ఫ్లడ్ లైట్స్ కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మ్యాచ్ అంపైర్‌కు కంప్లైంట్ ఇచ్చారు. కానీ, అంపైర్ అంగీకరించలేదు. దాంతో డ్రింక్స్ సమయంలో మరో ప్లేయర్‌ని పంపిన కెప్టెన్.. బ్యాడ్ లైట్‌పై కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా పంత్‌కు మెసేజ్ అందించాడు. దాంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు బ్యాడ్ లైటింగ్‌పై అంపైర్లతో చర్చించారు. అలా మ్యాచ్‌ని నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం టీమిండియాకు పెద్ద ఊరట అని చెప్పాలి. ఎందుకంటే.. భారత్‌కు ఇంకా 4 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో రిషబ్ పంత్ మాత్రమే కీలక బ్యాట్స్‌మెన్. మిగతా వారంతా బౌలర్లు. ఈ నేపథ్యంలో.. సోమవారం నాడు టీమిండియా మొదటి సెషన్‌లో ఎక్కువ సమయం ఆడేందుకు, పరుగులు చేసేందుకు ఆస్కారం దక్కుతుంది. తద్వారా మ్యాచ్ గెలిచేందుకు అవకాశం లభిస్తుంది. మరి అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా ఉపయోగించుకుని స్కోర్ చేస్తుందా? లేక బోల్తా పడుతుందా? సోమవారం తెలుస్తుంది. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి 154 పరుగుల లీడ్‌లో ఉంది.
ఇక మూడో రోజు మూడు సెషన్లు ఆడిన ఇంగ్లండ్ టీం.. ఆట ముగిసే సమయానికి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ 10 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి.. భారత్‌పై 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ జోరూట్ 180లతో నాటౌట్‌గా నిలిచాడు. బెయిర్ స్టో 57, బర్న్స్ 49 చొప్పున పరుగులు సాధించారు. ఇక భారత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 3, షమీ 2 వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టీమిండియా 364 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు రోహిత్(83), రాహుల్(129) శతక భాగస్వామ్యంతోపాటు కోహ్లీ 42, పంత్ 37, జడేజా 40 పరుగులతో తోడుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్‌సన్ 5, రాబిన్ సన్ 2, వుడ్ 2, అలీ 1 వికెట్ పడగొట్టారు.
BCCI Tweet:
It’s Stumps on Day 4⃣ of the 2nd #ENGvIND Test at Lord’s!#TeamIndia move to 181/6 & lead England by 154 runs.
6⃣1⃣ for @ajinkyarahane88
4⃣5⃣ for @cheteshwar1 @RishabhPant17 (14*) & @ImIshant (4*) will resume the proceedings on Day 5.Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/ulY0tJclSl
— BCCI (@BCCI) August 15, 2021
Also read:
CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన.. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ
Prabhas Movie: ప్రభాస్ మూవీకి ఆరెస్సెస్ సెగ? అందుకే ఎలర్ట్ అయ్యారా?