లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు. ఇంగ్లాండ్‌ని కేవలం 120 పరుగులకే కట్టడి చేశారు. 151 పరుగుల తేడాతో భారత్‌కి ఘన విజయం అందించారు. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఐదో రోజు 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ని భారత్ కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో అదరగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లతో రాణించారు.
ఓవర్‌నైట్ స్కోర్ 181/6 తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. జస్ప్రిత్ బుమ్రా 34 పరుగులు, మహ్మద్ షమి హాఫ్ సెంచరీ చేశారు. అనంతరం రిషభ్ పంత్ 22 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 209 వద్ద ఇషాంత్ శర్మ 16 పరుగులు వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం జోడీ కట్టిన షమి, బుమ్రా సింగిల్స్ తీస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఇద్దరు నాటౌట్‌గా నిలిచి 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో భారత్ చివరికి 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయింది.
WHAT. A. WIN! ? ?
Brilliant from #TeamIndia as they beat England by 1⃣5⃣1⃣ runs at Lord’s in the second #ENGvIND Test & take 1-0 lead in the series. ? ?
Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/rTKZs3MC9f
— BCCI (@BCCI) August 16, 2021
లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 151 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. ఇంగ్లాండ్ 120 పరుగులకు ఆలౌట్ అయింది. జేమ్స్ అండర్ సన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ 4 వికెట్లతో అదరగొట్టాడు.
WHAT. A. WIN! ? ?
Brilliant from #TeamIndia as they beat England by 1⃣5⃣1⃣ runs at Lord’s in the second #ENGvIND Test & take 1-0 lead in the series. ? ?
Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/rTKZs3MC9f
— BCCI (@BCCI) August 16, 2021
ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 25 పరుగులకు ఔటయ్యాడు. భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. సిరాజ్ బౌలింగ్‌లో పంత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. జేమ్స్ అండర్సన్ క్రీజులోకి వచ్చాడు.
Another one bites the dust! ? ?@mdsirajofficial strikes to get Jos Buttler out. ? ?#TeamIndia 1 wicket away from a victory at Lord’s. ? ? #ENGvIND
Follow the match ? https://t.co/KGM2YELLde pic.twitter.com/lHJ2Wp60HP
— BCCI (@BCCI) August 16, 2021
ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. వోలీ రాబిన్ సన్ 9 పరుగులకు ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉంది. మరోవైపు 25 పరుగులతో ఆడుతున్నాడు. క్రీజులోకి మార్క్ వుడ్ వచ్చాడు.
Plumb in front! ☝️
A successful review for #TeamIndia! ? ?
Jasprit Bumrah picks his 3⃣rd wicket. ? ?
England 120/8 as Ollie Robinson is out LBW. #ENGvIND
Follow the match ? https://t.co/KGM2YELLde pic.twitter.com/subE4Maeoy
— BCCI (@BCCI) August 16, 2021
ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు దాటింది. ఓటమి అంచున నిలిచింది. భారత్ విజయానికి ఇంకా 3 వికెట్ల దూరంలో ఉంది.
ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వేసిన 39వ ఓవర్‌లో తొలి బంతికి మోయిన్ అలీ(13) స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కగా తర్వాతి బంతికే సామ్‌కరన్(0) పంత్ చేతికి చిక్కాడు. దాంతో ఇంగ్లాండ్ 90 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి రాబిన్‌సన్ వచ్చాడు. మరోవైపు బట్లర్(8) పరుగులతో ఉన్నాడు. కాగా, భారత విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇక 39 ఓవర్లకు ఇంగ్లాండ్ 93/7తో నిలిచింది.
టీ విరామం తర్వాత ఇంగ్లాండ్‌కు మరో భారీ దెబ్బండి. బుమ్రా వేసిన బౌలింగ్‌లో తొలి ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(33) అవుటయ్యాడు. మూడో బంతికి రూట్ స్లిప్‌లో కోహ్లీ చేతికి దొరికిపోయాడు. దీంతో ఆ జట్టు 67 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ బ్రేక్‌కు ముందు ఇషాంత్ వేసిన చివరి బంతికి బెయిర్‌స్టో(2) వికెట్లముందు దొరికిపోయిన సంగతి తెలిసిందే. భారత విజయానికి ఇంకా ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజులో బట్లర్, మోయిన్ అలీ ఉన్నారు.
రెండో టెస్టు చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ వేసిన 21వ ఓవర్ చివరి బంతికి బెయిర్‌స్టో (2) LBWగా వెనుదిరిగాడు. దాంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 22 ఓవర్లకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ జో రూట్ (33) పరుగులతో కొనసాగుతున్నాడు. చివరి సెషన్‌లో భారత్ ఆరు వికెట్లు తీస్తే విజయం సాధించే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ వేసిన 15.3 ఓవర్‌కు హమీద్ 9 తొమ్మిది వికెట్ల వద్ద తన వికెట్‌ను వదుల్కున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 44 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. మరోవైపు రూట్(21) పరుగులతో ఉండగా బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. ఇక 17 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 53/3గా నమోదైంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో బుమ్రా.. బర్న్స్‌ను అవుట్ చేయగా రెండో ఓవర్‌లో షమి.. సిబ్లీ(0)ని పెవిలియన్ దారి చూపించాడు.దీంతో ఇంగ్లాండ్ ఒక్క పరుగే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో హమీద్, జో రూట్ ఉన్నారు. 2 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 3/2గా నమోదైంది.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకుంది. బుమ్రా వేసిన 0.3 ఓవర్‌కు రోరీబర్న్స్ సిరాజ్ చేతికి దొరికిపోయాడు. దాంతో ఆతిథ్య జట్టు ఒక్క పరుగుకే ఒక వికెట్ కోల్పోయింది. క్రీజులో సిబ్లీ, హమీద్ కొనసాగుతున్నారు.
అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న టైలెండర్లకు భోజన విరామ సమయానికి టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఘన స్వాగతం పలికారు. చప్పట్లతో అభినందించారు. ఏళ్ల తరబడి ఈ ఇన్నింగ్స్ గుర్తుండిపోతుందని పేర్కొంటూ బీసీసీఐ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. బుమ్రా(30), షమి(52) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించడంతో జట్టు సభ్యులు సంతోషంలో మునిగారు.
A partnership to remember for ages for @Jaspritbumrah93 & @MdShami11 on the field and a rousing welcome back to the dressing room from #TeamIndia.
What a moment this at Lord’s ???#ENGvIND pic.twitter.com/biRa32CDTt
— BCCI (@BCCI) August 16, 2021
టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఐదోరోజు భోజన విరామం అనంతరం తిరిగి ఆట ప్రారంభమవ్వగా బుమ్రా(34*), షమి(56*) చెరో నాలుగు పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 109.3 ఓవర్ల తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. అప్పటికి స్కోర్ 298/8గా నమోదైంది. దాంతో ఇంగ్లాండ్ టార్గెట్ ఇప్పుడు 272 పరుగులుగా నమోదైంది.
ఐదో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 286/8 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా(30), షమి(52) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగుల కీలక పార్టనర్ షిప్ నెలకొల్పి నాటౌట్‌గా కొనసాగుతున్నారు.
మొయిన్ అలీ వేసిన ఓవర్‌లో మహ్మద్ షమీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్ మూడో బంతికి షమీ రెండో బంతికి మిడ్ వికెట్ వద్ద ఫోర్ కొట్టాడు. అదే సమయంలో బంతికి 92 మీటర్లకు సిక్స్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో షమీకి ఇది రెండో అర్ధ సెంచరీ. అతను 57 బంతుల్లో ఒక సిక్స్ , ఐదు ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు.
విదేశాలలో తొమ్మిదో వికెట్‌కు టీమిండియా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా అత్యధిక స్కోరు నమోదు చేసిన జోడీగా రికార్డు నమోదైంది.
ఏం చేస్తారు లే.. అనుకున్న టీమిండియా టెయిలెండర్లు దూకుడుమీదున్నారు. షమి(34), బుమ్రా (23) నిలకడగా ఆడుతూ ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల పార్టనర్ షిప్‌ను క్రియేట్ చేశారు. దాంతో కష్టాల్లో ఉన్న టీమిండియాకు గట్టెక్కించారు. ఈ క్రమంలోనే 102 ఓవర్లకు భారత్ స్కోర్ 259/8గా నమోదైంది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం 200 పరుగులు దాటింది. మార్క్‌వుడ్ వేసిన 95వ ఓవర్‌లో బుమ్రా(14), షమి(13) నాలుగు సింగిల్స్ తీయడంతో ఓట్టు స్కోర్ 229/8కి చేరింది. దాంతో భారత్ ఆధిక్యం 202 పరుగులకు చేరింది.
మార్క్‌వుడ్ వేసిన 92.4 బంతి బుమ్రా హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఓవర్‌లో బుమ్రా(9) తొలి బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో టీమిండియా స్కోర్ 220/8గా చేరింది. ఇక షమి(9) పరుగులతో కొనసాగుతున్నాడు.
రాబిన్సన్ వేసిన 89.3 ఓవర్‌కు ఇషాంత్ శర్మ(8) అవుటయ్యాడు. LBWగా వెనుదిరిగాడు. అతడు రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో భారత్ 209 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా(2), షమి(7) పరుగులతో కొనసాగుతున్నారు. 90 ఓవర్లకు భారత్ స్కోర్ 211/8గా నమోదైంది.
ఒల్లీ రాబిన్సన్ బౌలింగ్‌లో టీమిండియాకు భారీ దెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాబిన్సన్ ఓవర్ మూడో బంతిని పంత్ రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకి జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్లింది. పంత్ 46 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక్కడ నుండి భారతదేశానికి ముందున్న మార్గం ఇప్పుడు కష్టంగా ఉంది.
2nd Test. 85.3: WICKET! R Pant (22) is out, c Jos Buttler b Ollie Robinson, 194/7 https://t.co/KGM2YEualG #ENGvIND
— BCCI (@BCCI) August 16, 2021
టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఐదవ రోజు ఆట ప్రారంభమైంది. జేమ్స్ ఆండర్సన్ భారత రెండో ఇన్నింగ్స్‌లో 82 వ ఓవర్‌ను తీసుకువచ్చాడు. అతను ఈ ఓవర్‌లో ఒక పరుగు ఇచ్చాడు.