IND vs ENG 2nd Test: ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ కోహ్లీ, అశ్విన్‌.. లంచ్‌ బ్రేక్‌ సమయానికి..

Ind vs Eng Live: ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన కోహ్లిసేన.. ఇంగ్లాండ్‌ జట్టును కేవలం 134 పరుగులకు కట్టడి చేసిన విషయం తెలిసిందే. అయితే...

IND vs ENG 2nd Test: ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ కోహ్లీ, అశ్విన్‌.. లంచ్‌ బ్రేక్‌ సమయానికి..

Updated on: Feb 15, 2021 | 12:12 PM

Ind vs Eng Live: ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా చెపాక్‌ స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన కోహ్లిసేన.. ఇంగ్లాండ్‌ జట్టును కేవలం 134 పరుగులకు కట్టడి చేసిన విషయం తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన ఆరంభంలోనే టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అవుట్‌ అయ్యాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి (ఆదివారం) టీమిండియా వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఇకా మూడో రోజు ఉత్సాహంగా మ్యాచ్‌ ప్రారంభంచిన టీమిండియాకు దెబ్బ మీద దెబ్బతగిలింది. వరుసగా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. పుజారా, రహానే, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌, అక్సర్‌ పటేల్‌ స్వల్ప పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌ బాటప్టటారు. ఇక వరుస వికెట్లతో కష్టాల్లో పడ్డ భారత్‌ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో నిలకడగా ఆడుతూ భారత స్కోర్‌ను పరుగులెత్తించారు. లంచ్‌ బ్రేక్‌ సమాయానికి వీరిద్దరూ ఏడో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం భారత స్కోర్‌ 156/6 వద్ద కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 195 పరుగులతో కలిపి టీమిండియా ఓవరాల్‌గా 351 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరి లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ హవాను కొనసాగిస్తారా చూడాలి. ప్రస్తుతం కోహ్లి (38), అశ్విన్‌ (34) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Also Read: India vs England: ఓ వైపు బ్యాటింగ్ చేస్తూ.. మరోవైపు యోగా చేస్తూ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న రహానే ఫోటోలు..