IND vs ENG 2nd Test: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 45 ఓవర్లకు 119/3..

|

Aug 14, 2021 | 5:07 AM

IND vs ENG 2nd Test: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

IND vs ENG 2nd Test: రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోర్ 45 ఓవర్లకు 119/3..
India
Follow us on

IND vs ENG 2nd Test: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రోరీ బర్న్స్, డోమిక్ సిబ్లీ, హమీద్ జో రూట్ వికెట్లు సమర్పించుకోగా.. జో రూట్​ (48*), బెయిర్​ స్టో (6*) ​నాటౌట్​గా నిలిచారు. ఇక టీమిండియా బౌలర్లు సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు భారత్ తన ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 364 పరుగులు చేసింది.

ఇక 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలవలేక.. రెండు పరుగులకే ఒక వికెట్ సమర్పించుకుంది. మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే రాహుల్, రహానే వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. వీరి తరువాత వచ్చిన పంత్, జడేజా కాస్త రాణించారనే చెప్పాలి. ఇద్దరూ కలిసి 49 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ, ఈసారి బ్యాడ్ టైమ్ మార్క్ వుడ్ రూపంలో వచ్చింది. పంత్‌ షాట్‌కు ట్రై చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ చేతికి చిక్కింది. దాంతో పంత్ వెనుదిరిగారు. మొత్తంగా ఇవాళ 88 పరుగులు(మొత్తం 364) చేసి 7 వికెట్లు సమర్పించుకుంది టీమిండియా.

భారత్ ఇన్నింగ్స్ ముగియంతో.. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగారు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్. అయితే, రూట్ సేన కూడా తొలుత తడబడినా రాణించే ప్రయత్నం చేశారు. దాదాపు 23 పరుగుల వరకు నిలకడగా ఆడారు. కానీ, సిరాజ్ మాయ చేసేశాడు. వరుస బంతుల్లో సిబ్లీతో పాటు హసీబ్‌ను పెవిలియన్‌కు పంపించేశాడు. ఆ తరువాత క్రీజులోకి కెప్టెన్ రూట్ వచ్చాడు. బర్న్స్, రూట్ ఇద్దరూ కలిసి చక్కగా ఆడారు. సిరాజ్ ఎపెక్ట్‌తో ఆచి తూచి ఆడుతూ జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. అలా ఇద్దరూ కలిసి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఈసారి షమీ షైన్ అయ్యాడు. బర్న్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. మొత్తంగా ఇంగ్లండ్ 45 ఓవర్లు ఆడి.. 119/3 స్కోర్ నమోదు చేసింది.

Also read:

Hyderabad: వేరే వ్యక్తి మరదలి ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్న యువకుడు.. ఇదేంటని నిలదీసినందుకు..

IND vs ENG 2nd Test: ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడాడు.. మొదటి బంతికే గోల్డెన్ డక్.. 75 సంవత్సరాల చెత్త రికార్డుకు బ్రేక్

Adilabad BJP Leaders: దాబా పే చర్చా.. అయ్యో హస్తం వీడి తప్పు చేశామా..?