India vs England : చెపాక్ స్టేడియంలో చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్. టెస్టు క్రికెట్ చరిత్రలో రూట్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. వందవ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించాడు. చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ శైలిని ప్రదర్శించాడు.
బౌలర్లకు సహకరించని చిదంబరం చెపాక్ స్టేడియంలో.. రూట్ భారీ ఇన్నింగ్స్ ను నెలకొల్పాడు. ఓ భారీ సిక్సర్‌తో రూట్ తన ఖాతాలో డబుల్ సెంచరీ వేసుకున్నాడు. ఫ్లాట్‌గా ఉన్న పిచ్‌పై చాలా సులువుగా రూట్ తన షాట్లు ఆడాడు.
అతని డబుల్ సెంచరీలో 19 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. నాలుగో వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రూట్.. స్టోక్స్ నిష్క్రమణ తర్వాత డబుల్ సెంచరీ అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై రూట్ తన స్టయిలిస్ ఆటను కొనసాగించాడు.
ఎటువంటి చెత్త షాట్లు ఆడకుండా.. భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టాడు. టాఫ్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ చెన్నై మైదానంలోనూ తన ఆటతీరులో అలరించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రూట్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌలర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి
ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..?
Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ