IND vs ENG 1st Test: ఐసీసీ సంచలన నిర్ణయం.. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్- ఇంగ్లాండ్ సిరీస్‌లోనే..
India vs England 1st Test Match, Day 1: ఇండియన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తీసుకున్న ఓ కీలక నిర్ణయం కారణంగా 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్- ఇంగ్లాండ్..

India vs England 1st Test Match, Day 1: ఇండియన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తీసుకున్న ఓ కీలక నిర్ణయం కారణంగా 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్- ఇంగ్లాండ్ సిరీస్‌లో ప్రత్యేకత చోటు చేసుకుంది. చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు స్వదేశీ అంపైర్లు పర్యవేక్షిస్తున్నారు.
1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టుకు ఎల్. నరసింహన్, వీకే రామస్వామి అంపైర్లుగా వ్యవహరించగా.. ఆ తర్వాత మరోసారి ఇప్పుడే స్వదేశీ అంపైర్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కరోనా కారణంగా కొద్దిరోజుల క్రితమే ఐసీసీ ప్యానెల్‌లో ఉండే స్వదేశీ అంపైర్లు అయిన నితిన్ మీనన్, అనిల్ చౌదరీ, వీరేందర్ శర్మలను ఈ సిరీస్‌కు నియమించింది. ఈ క్రమంలోనే తొలి టెస్టుకు అనిల్, నితిన్ అంపైర్లుగా బరిలోకి దిగగా.. రెండో టెస్టులో వీరేందర్ కూడా మరో అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక తొలి రెండు టెస్టులకు జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్నాడు.
Also Read:
India vs England, 1st Test, Day 1 LIVE Score: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. అధిపత్యం చలాయిస్తున్న టీమిండియా..





