IND vs ENG 1st Test Highlights: భారత్‌ గెలుపుపై నీళ్లు చల్లిన వరుణుడు.. తొలి టెస్ట్‌ వర్షార్పణం.. డ్రా ముగిసిన మ్యాచ్‌.

|

Aug 08, 2021 | 9:14 PM

IND vs ENG 1st Test Day 5: నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఫలితం నేడు తేలనుంది. టీమిండియా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి....

IND vs ENG 1st Test Highlights: భారత్‌ గెలుపుపై నీళ్లు చల్లిన వరుణుడు.. తొలి టెస్ట్‌ వర్షార్పణం.. డ్రా ముగిసిన మ్యాచ్‌.
Test Match

IND vs ENG 1st Test Day 5: భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ట మధ్య జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. భారత్‌ గెలుపు దాదాపు ఖాయమని అందరూ భావించిన వేళ వరుణుడు ఆశలను ఆడియాశాలు చేశాడు. దీంతో తొలి టెస్ట్‌ ఫలితం తేలకుండా పోయింది. ఐదో రోజు కేవలం 157 పరుగుల లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగగా ఒక్క బంతి కూడా పడలేదు. మ్యాచ్‌ను ప్రారంభించేందుకు చివరి సెషన్‌ వరకూ ఎదురు చూసినా వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52/1తో నిలిచింది. రోహిత్‌ శర్మ(12), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌(26) ధాటిగా ఆడుతూ బ్రాడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్‌ 34 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్‌ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ 5, అండర్సన్‌ 4 వికెట్లతో పడొట్టారు.

ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. షమి వేసిన 85.5 ఓవర్‌కు రాబిన్‌సన్‌(15) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్‌, శార్ధూల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్‌ తీశాడు. జో రూట్‌ (109) శతకంతో చెలరేగాడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Aug 2021 08:39 PM (IST)

    డ్రా గా ముగిసిన తొలి టెస్ట్…

    భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ట మధ్య జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. భారత్‌ గెలుపు దాదాపు ఖాయమని అందరూ భావించిన వేళ వరుణుడు ఆశలను ఆడియాశాలు చేశాడు. దీంతో తొలి టెస్ట్‌ ఫలితం తేలకుండా పోయింది. ఐదో రోజు కేవలం 157 పరుగుల లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగగా ఒక్క బంతి కూడా పడలేదు. మ్యాచ్‌ను ప్రారంభించేందుకు చివరి సెషన్‌ వరకూ ఎదురు చూసినా వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

  • 08 Aug 2021 06:00 PM (IST)

    ఆటకు వరణుడి ఆటంకం.. మ్యాచ్‌ వర్షార్పణం కానుందా?

    టీమిండియా విజయం దాదాపు ఖరారు అనుకుంటున్న ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహణపై సందేహలు ఏర్పడుతున్నాయి. చివరి రోజు మ్యాచ్‌ ప్రారంభానికి అడ్డుగా మారాడు. దీంతో మ్యాచ్‌ ప్రారంభమవుతుందా.? లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి వరుణుడు కరునిస్తాడో లేదో వేచి చూడాలి.


  • 08 Aug 2021 03:34 PM (IST)

    ఆదిలోనే వర్షం అడ్డంకి..

    నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం పడుతుండడంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టగానే మ్యాచ్ ను ప్రారంభించనున్నారు. తొలి టెస్టులో ఇండియా విజయానికి కేవలం 157 పరుగుల దూరంలో ఉంది.

  • 08 Aug 2021 03:23 PM (IST)

    ప్రాక్టిస్‌లో స్పీడు పెంచి విరాట్‌.. ఈరోజు రఫ్ఫాడించడానికేనా.?

    ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డక్‌ అవుట్‌గా వెనుతిరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో అది రిపీట్‌ చేయకూడదనుకున్నామోమో గానీ ప్రాక్టిస్‌లో జోష్‌ని పెంచాడు. ఈ క్రమంలోనే శనివారం నాలుగో రోజు మ్యాచ్‌ పూర్తికాగానే గ్రౌండ్‌లోకి వచ్చి సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి విరాట్‌ ఈరోజు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి.

Follow us on