IND vs ENG: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా! 80 పరుగులకే సగం జట్టు ఢమాల్..

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 సిరీస్ ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటూ, ఇంగ్లాండ్‌ను కేవలం 80 పరుగులకే 5 వికెట్లు కూల్చారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు, బుమ్రా ఒక వికెట్ తీసి జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది.

IND vs ENG: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా! 80 పరుగులకే సగం జట్టు ఢమాల్..
Ind Vs Eng

Updated on: Jul 14, 2026 | 7:08 PM

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు. టీ20ల్లో వరుస ఓటములను మర్చిపోయి.. వన్డే సిరీస్‌ను ఫ్రెస్ మైండ్స్‌తో మొదలుపెట్టిన టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎందుకున్న ఇంగ్లాండ్‌ను టీమిండియా బౌలర్లు ఇబ్బంది పెడుతున్నారు. కేవలం 80 పరుగులకే వారి 5 వికెట్లు కూల్చేశారు. యంగ్ బౌలర్ గుర్నూర్ బ్రార్ సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. టీ20ల్లో దారుణంగా విఫలం అయిన ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్‌లో మాత్రం మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.

ఇప్పటి వరకు 6 ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్‌ను భయపెట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ మాత్రమే 43 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో జాకబ్ బెతెల్ 14,  కెప్టెన్ హ్యారీ బ్రూక్ 1, జోస్ బట్లర్ 5, సామ్ కరన్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో ఉంది. టీ20ల్లో టీమిండియాను ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే భారత అభిమానుల కోరికను తీర్చే పనిలోనే టీమిండియా ఉన్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి మ్యాచ్ చివరికి ఎటు వైపు తిరుగుతుందో. ఇప్పటికైతే టీమిండియా బౌలర్లు మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించారు.

Follow Us